ఎలాంటి అపోహలకు, భయాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                        తేది: 19-11-20 21

ఎలాంటి అపోహలకు, భయాలకు  గురి కాకుండా ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

శుక్రవారం గద్వాల్ మండలం ముల్కల్ పల్లి ,తుర్కొని పల్లి, సంగాల సబ్ సెంటర్  , ధరూర్ మండలం ఉప్పేరు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలో    జిల్లా కలెక్టర్ పర్యటించారు. ముల్కల్ పల్లి గ్రామం లో కలెక్టర్ స్వయంగా గ్రామ ప్రజలతో మాట్లాడారు. మీరందరూ వ్యాక్సిన్ వేసుకున్నార అని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ   ఓటరు జాబితా ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సినేషన్ వేయాలని, గ్రామాలలో ఆశ, ఏ ఎన్ ఎం లు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకొని వారిని గుర్తించి వారికీ తప్పని సరిగా వ్యాక్సిన్  వేయిoచాలని ,ఆదార్ నెంబర్, మొబైల్ నెంబర్ పూర్తి వివరాలు covid పోర్టల్  లో ఎంట్రీ చేయాలనీ ,ఎక్కడైనా వేరే చోట వ్యాక్సిన్ వేసుకున్న వారూ  ఉంటే వారి  వివరాలు పోర్టల్ లో చెక్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు.  గ్రామం వారిగా ఓటర్ల జాబితా ప్రకారం ఇప్పటి వరకు ఎంత మందికి వేశారు, ఇంకా ఎంత మంది పెండింగ్ ఉన్నారు అని వివరాలు అడిగి తెలుసుకునారు.  ఎక్కడైతే పెండింగ్ ఉన్నారో వారికీ తప్పని సరిగా వ్యాక్సిన్ వేసి గ్రామాలలో 100 శాతం   వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేటట్లు చూడాలన్నారు. అదేవిదంగా ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఓపి రిజిస్టర్ ను చెక్ చేసి , covid పోర్టల్ లో నమోదు అయిన వారి వివరాలు తెలుసుకున్నారు. మొదటి డోస్ వేసుకున్న వారికి 84 రోజుల తర్వాత రెండవ డోస్ వేయాలని అన్నారు. గ్రామం లో పెండింగ్ ఉన్న వారికందరికీ వ్యాక్సిన్ వేయాలని ఏ ఎన్ ఎం లకు చెప్పాలని,   సెంటర్ లో  గర్భ వతులకు కాన్పులు  అయ్యేటట్లు చూడాలని అన్నారు.

కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చందునయాక్, డాక్టర్ జయరాజ్, పంచాయతి సెక్రెటరీలు  పరుశు రామ్, ఖజామీర్ ,రోజా రాణి , ఏ ఎన్ ఎం లు, ఆశాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి ద్వారా జారీ చేయడమైనది.

 

Share This Post