ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 18 సం. పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                                   తేది:18- 9- 2021

 

జోగులాంబ గద్వాల జిల్లా

 

ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 18 సం. పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

శనివారం గద్వాల పట్టణంలోని ప్రాక్టీసింగ్ హై స్కూల్, ఇండో ఇంగ్లీష్ స్కూల్, గంజి పేట ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా వ్యాక్సిన్ కోసం వచ్చిన వారితో  జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  ఎలాంటి బయందోళనలకు గురి కాకుండా  అందరు వ్యాక్సిన్ వేసుకోవాలని ,  వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనా రాకుండ అందరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.   ఇప్పటి వరకు ఎందుకు వేసుకోలేదు,  అని అడుగగా వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమవుతుందోనని భయపడుతున్న కాలనీవాసులు కలెక్టర్  కు తెలిపారు.  భయం తో ఏమవుతుందోనని  వేసుకోలేదు అని బదులిచ్చారు. వార్డుల వారీగా 18 సం. పైబడిన వారు ఎంత మంది ఉన్నారని ,ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు , ఇంకా ఎంత మందికి వ్యాక్సిన్ వేయాలి, ఉన్నారు,  ఎన్ని రోజులల్లో పూర్తి అవుతుంది, ప్రతి ఒక్కరి వివరాలు ఆన్లైన్ లో  రిజిస్ట్రేషన్ చేస్తున్నారా,    వైద్య  అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం లో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా రాదని కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ ,జిల్లా వైద్య అధికారి చందు నాయక్, డాక్టర్ అశ్విని,  , కౌన్సిలర్ శంకర్ ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

Share This Post