ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం —1
పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
• ప్రతి విద్యార్థి మాస్క్, శానిటైజర్ వినియోగించేలా చర్యలు
• మల్లెరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుద్ద్య చర్యలు చేపట్టాలి
అవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలి
• ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , సెప్టెంబర్ 14 :-. గ్రామంలో పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎలిగేడు మండలంలోని సుల్తా
న్ పూర్ గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులు, మంచి నీటి ట్యాంకు లను కలెక్టర్ పరిశీలించి పరిశుబ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసారు. పాఠశాలల ఆవరణలో నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. దోమల నివారణకు పకడ్భంది చర్యలు తీసుకోవాలని పంచాయతి కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాఠశాల తరగతి గదులు, పరిసరాల్లో ప్రతి రోజు శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు వచ్చే పిల్లలు మాస్క్ లు ధరించే విధంగా చూడాలన్నారు. సానిటైజర్లు అందుబాటులో ఉంచడం, సాధ్యమైనంత వరకు పిల్లలను దూరం పాటించే విధంగా చూడాలన్నారు. మల్లెరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో పకడ్భందిగా పారిశుద్ద్య చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు
అనంతరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్ లను చెక్ చేశారు. గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ కింద ఉన్న లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

 ఎంపిడిఒ  శ్రీనివాస్ మూర్తి,  ఎంపీఒ శ్రావణ కుమార్, సర్పంచ్ వెంకటేశ్వరరావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి,పెద్దపల్లిచే జారీచేయనైనది.

Share This Post