slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

ఎల్కతుర్తి-మెదక్, జనగామ-సిరిసిల్లా నేషనల్ హైవే పనులు వేగవంతంపై జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, నేషనల్ హైవే అథారిటీ, అధికార వర్గాలతో రాష్ట్ర మంత్రి హరీశ్ సమీక్ష. – Information and Public Relations Department, Government of Telangana

ఎల్కతుర్తి-మెదక్, జనగామ-సిరిసిల్లా నేషనల్ హైవే పనులు వేగవంతంపై జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, నేషనల్ హైవే అథారిటీ, అధికార వర్గాలతో రాష్ట్ర మంత్రి హరీశ్ సమీక్ష.


ప్రెస్ రిలీజ్

నేషనల్ హైవే రహదారి పనులు స్పీడ్ గా జరగాలి.

ఎల్కతుర్తి-మెదక్, జనగామ-సిరిసిల్లా నేషనల్ హైవే పనులు వేగవంతంపై జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, నేషనల్ హైవే అథారిటీ, అధికార వర్గాలతో రాష్ట్ర మంత్రి హరీశ్ సమీక్ష.

సిద్ధిపేట 22 నవంబర్ 2022 :

ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకూ నేషనల్ హైవే -765డీజీ నిర్మాణ పనులు, జనగామ-సిరిసిల్లా హైవే రహదారి నిర్మాణ పనులు స్పీడ్ గా జరపాలని అధికార వర్గాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ఆదేశించారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ డీఈ మోహన్, ఆర్డీఓలు ఆనంతరెడ్డి, విజయేందర్ రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులు, వివిధ సంబంధిత శాఖాధికారులతో కలిసి ఎల్కతుర్తి-మెదక్ హైవే రహదారిపై సమీక్షా సమావేశం జరిపారు.

రహదారి నిర్మాణం కోసం అటవీశాఖ అభ్యంతరాలు వారం రోజుల్లో క్లియరెన్స్ చేయాలని అటవీశాఖ అధికార వర్గాలకు ఆదేశించారు.

ఈ నేషనల్ రహదారి మీదుగా 12 చోట్ల ఇరిగేషన్ కాల్వలు క్రాసింగ్స్ వస్తున్న దరిమిలా, వాటిలో ఇరిగేషన్, నేషనల్ హైవే అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఆయా ప్రాంతాలను గుర్తించి రహదారి నిర్మాణం చేపట్టాలని సూచించారు.

తాగునీటి వాటర్ పైపులైన్ కు సంబంధించి అంశాలపై చర్చించి ముందు పైపులైన్ నిర్మాణాలు చేపట్టి ఆ తర్వాత పాతవి తొలగించాలని, అలాగే అసంపూర్తిగా పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని అధికార వర్గాలను ఆదేశించారు.

జనగామ నుంచి సిద్ధిపేట మీదుగా నేషనల్ హైవే రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని, చేర్యాల నుంచి దుద్దేడ మధ్య రోడ్డు పూర్తిగా పాడై పోయి వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించాయని, యుద్ధప్రాతిపదికన చేర్యాల-దుద్దేడ మధ్య రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులను మంత్రి ఆదేశించారు.

హన్మకొండ, సిద్ధిపేట, మెదక్ జిల్లాల మీదుగా 137.6 కిలో మీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించినట్లు, వీటిలో ఎల్కతుర్తి నుంచి సిద్ధిపేటకు 64 కిలో మీటర్లు రెండవ ప్యాకేజీగా, సిద్ధిపేట నుంచి మెదక్ వరకూ 69 కిలో మీటర్లు మొదటి ప్యాకేజీగా సిద్ధిపేట జిల్లాలో దాదాపు 80 కిలో మీటర్ల మేర నేషనల్ హైవే, అలాగే జనగామ జిల్లా నుంచి చేర్యాల, సిద్ధిపేట మీదుగా సిరిసిల్లా వరకూ సుమారు 105 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేపై సాగుతున్న రహదారి నిర్మాణ అంశాలపై అధికార వర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు.

ఆర్అండ్ బీ, ఫారెస్ట్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, రెవెన్యూ, రైల్వే శాఖల సమన్వయంతో హైవే నిర్మాణంలో ఏలాంటి సమస్యలకు తావివ్వకుండా పనులు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
issued by District Public Relations Office siddipet district

Share This Post