ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సి.ఎస్ సోమేశ్ కుమార్

భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్.బి స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు  పరిశీలించారు. ఈనెల 22 వ  తేదీన మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే  ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేలమందికి పైగా పాల్గొంటారని వెల్లడించారు.

ఈ సమావేశంలో అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పోలీస్ కమీషనర్ చౌహాన్ , DCP, Traffic రంగనాధ్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్,  హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, MD, TSICC నరసింహారెడ్డి, సమాచార  శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Share This Post