ఎల్లమ్మ చెరువు మిని ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం —2
దసరాలోపు మినిట్యాంక్ బండ్ సివిల్ పనులు పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
• డిసెంబర్ లోపు ఎల్లమ్మ చెరువు మిని ట్యాంక్ బండ్ పనులు పూర్తి
• వినాయక నిమజ్జనం పాయింట్ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలి
• ఎల్లమ్మ చెరువులో ఉన్న నాచు, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలి
• ఎల్లమ్మ చెరువు మిని ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , సెప్టెంబర్ 04 :-
. దసరాలోపు ఎల్లమ్మ చెరువు మిని ట్యాంక్ బండ్ సివిల్ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లిలోని ఎల్లమ్మ చెరువు మిని ట్యాంక్ బండ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పెద్దపల్లిలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, మినిట్యాంక్ బండ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. దసరాలోపు ఎల్లమ్మ చెరువు మిని ట్యాంక్ బండ్ సివిల్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఎల్లమ్మ చెరువు వద్ద పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని, లైటింగ్ , రోడ్డు, గ్రీనర్ పనులు సైతం చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. డిసెంబర్ మాసంలోపు ఎల్లమ్మ చెరువు మినిట్యాంక్ బండ్ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు మున్సిపల్ మరియు నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో మిని ట్యాంక్ బండ్ పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో వినాయక నిమజ్జన పాయింట్లను కలెక్టర్ పరిశీలించి, వినాయక నిమజ్జన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేసారు. ఎల్లమ్మ చెరువు నీరు వచ్చే అప్రోచ్ చానెల్ ను సైతం కలెక్టర్ పరిశీలించారు. ఎల్లమ్మ చెరువులో ఉన్న నాచు, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు

పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి రావు,  నీటిపారుదల శాఖ  డిఈ రాజెందర్,  సంబంధిత అధికారులు తదితరులు ఈ   కార్యక్రమంలో  పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి,పెద్దపల్లిచే జారీచేయనైనది.

Share This Post