ఎల్లారెడ్డి పేట లో స్టేట్ కల్చరల్ ఫెస్ట్- ఈ నెల 30, అక్టోబర్ 1 న రెండు రోజుల పాటు స్టేట్ కల్చరల్ ఫెస్ట్

ఎల్లారెడ్డి పేట లో స్టేట్ కల్చరల్ ఫెస్ట్

– ఈ నెల 30, అక్టోబర్ 1 న రెండు రోజుల పాటు స్టేట్ కల్చరల్ ఫెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో
తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ స్టేట్ కల్చరల్ ఫెస్ట్ 2022-2023 రెండు రోజుల పాటు జరగనుంది.

ఈ నెల 30 న ప్రారంభం కానున్న స్టేట్ కల్చరల్ ఫెస్ట్ అక్టోబర్ 1 న ముగియనుంది.
స్టేట్ కల్చరల్ ఫెస్ట్ జిల్లాలో జరగడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

ఈ స్టేట్ కల్చరల్ ఫెస్ట్ కు హాజరు కావాల్సిందిగా బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ జయంతిని ఎల్లారెడ్డిపేట ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి రెడ్డి కలెక్టరేట్లో కలిసి ఆహ్వానించారు.

 

Share This Post