ఎసిఎ సిఎస్ఆర్, డిఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనులు ప్రజలకు ఎంతో అవసరమని జాప్యం చేయక వేగవంతంగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు..

శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు ఎస్సిపి, సిఎస్ఆర్, డియంఎఫ్ నిధులు ద్వారా చేపట్టిన పనులపై పోలీస్, డిఆర్డిఓ, పంచాయతీరాజ్, ఐటిడిఎ, సిపిఓ కంపెనీల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటాయించిన నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి పనులు ప్రారంభానికి ముందు, పనులు జరుగుతున్నపుడు, పూర్తయిన పనుల ఫోటోలను జతచేసి సంబంధిత అధికారులు ధృవీకరణతో డిఆర్డిఓకు నివేదికలు అందచేయాలని చెప్పారు. కేటాయించిన నిధులకు యుసిలను సకాలంలో అందచేయాలని చెప్పారు. సిఎస్ఆర్ నిధులు ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి ముందస్తు తన అనుమతి తీసుకోవాలని పరిశ్రమల అధికారులకు సూచించారు. సిఎస్ఆర్ నిధులు ద్వారా చేపట్టిన డిజిటల్ తరగతుల నిర్వహణపై చేసిన ఏర్పాట్లును తెలియచేస్తూ నివేదిక ఇవ్వాలని డిఈఓకు సూచించారు. జిల్లా ఏర్పాటు నుండి ఇప్పటి వరకు నిధులు కేటాయింపులు, ఖర్చులు, చేపట్టిన పనులకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని చెప్పారు. సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అంగన్వాడీ భవనాలు నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ నిర్మాణం పూర్తయిన భవనాలను సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని, అసంపూర్తిగా ఉ న్న భవనాలను తీసుకోవద్దని సంక్షేమ అధికారికి సూచించారు. అంగన్వాడీ భవనాలు అప్పగింతపై తనకు నివేదిక ఇవ్వాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు బాలా పెయింటింగ్స్ వేయించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కంపెనీల చట్టం ప్రకారం పరిశ్రమలకు వచ్చిన ఆదాయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నదని, ప్రాధాన్యతను బట్టి పనులు చేపట్టు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులనకు సంబంధించి ప్రణాళికలు తయారు చేయాలని పరిశ్రమల అధికారులను ఆదేశించారు. నిధులు కేటాయింపు చేసినా ఇప్పటి వరకు పనులు చేపట్టిని నిధులను తిరిగి వాపస్ ఇవ్వాలని, అట్టి నిధులతో ప్రాధాన్యతననుసరించి ఇతర పనులు చేపడతామని చెప్పారు. కేటాయించిన నిధులతో చేపట్టిన పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ చేయడం వల్ల పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయుటకు అవకాశం ఉంటుందని చెప్పారు. చేపట్టిన పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, క్యాలిటీ కంట్రోల్ నివేదికలు అందచేయాలని చెప్పారు. జాప్యం కాకుండా పనులను సకాంలో పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్సిఏ నిధులతో చేపట్టిన పంచాయతీ భవనాల నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకుని ఫిబ్రవరి మాసం వరకు పూర్తి చేయాలని చెప్పారు. భద్రాచలం పట్టణాన్ని అందమైన, పరిశ్చుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుటకు స్వచతా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టు విధంగా చర్యలు తీసుకోవాలని ఐటిసి అధికారులను ఆదేశించారు. ఇంటింటి నుండి సేకరణ జరుగుతున్న తడి, పొడి వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పనకు స్వచ్చబడి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. భద్రాచలంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు ఐటిసి, డిపిఓలతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరా చేయుటలో ఐటిసి సంస్థ సహాకారాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదనాజు, డిఆర్డీ అశోక్ చక్రవర్తి, గిరిజన, పంచాయతీరాజ్ ఈఈలు రాములు, సుధాకర్, మంగ్యా, మిషన్ బగీరధ ఈఈ తిరుమలేష్, సిపిని శ్రీనివాసరావు, సంక్షేమ అధికారి వరలక్ష్మి, సింగరేణి, పవర్ కార్పోషన్, ఐటినీ, నవభారత్ తదితర కంపెనీల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post