ఎస్టీ నిరుద్యోగ యువతకు శిక్షణ….ఫిరంగి

ఎస్టీ నిరుద్యోగ యువతకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కంస్ట్రక్షన్ లో ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామింగ్, సూపర్ వైజర్ స్ట్రక్చర్ ప్రోగ్రాం కోర్సుల నందు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నదని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి నేడొక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పించడంతో పాటు శిక్షణ పూర్తయిన తరువాత ప్రైవేట్ నిర్మాణ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ నందు శిక్షణకై అభ్యర్థులు బి.టెక్ లేదా బి.ఈ. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలని, సూపర్వైజర్ స్ట్రక్చర్ లో శిక్షణకైతే ఇంటర్మీడియట్ లేదా ఐ.టి.ఐ. సివిల్, లేదా డిప్లొమా సివిల్ కలిగి ఉండాలని అన్నారు. ఈ రెండు వృత్తులలో శిక్షణకు అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాలలోపు కలిగి కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర, పట్టన ప్రాంతాలలో రెండు లక్షల లోపు కలిగి ఉండాలని పేర్కొన్నారు. మెరిట్ మరియు వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఆసక్తి ఉండి అర్హత గల జిల్లాకు చెందిన అభ్యర్థులు అక్టోబర్ 20 లోగా www.nac.edu.in and https://tstribalwelfare.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు తో పాటు విద్యార్హతలు, కుల,ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లు అప్ లోడ్ చేయాలని అన్నారు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణ జాయినింగ్ సమయంలో హార్డ్ ప్రతులు సమర్పించాలని వివరాలకు తన కార్యాలయంలో సంప్రదించవలసినదిగా ఫిరంగి సూచించారు.

Share This Post