ఎస్సిఏ, సిఎస్ఆర్ మరియు డియంఎఫ్టి నిధులు మంజూరు, వినియోగంపై సమగ్ర నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

ఎస్సిఏ, సిఎస్ఆర్ మరియు డియంఎఫ్టి నిధులు మంజూరు, వినియోగంపై సమగ్ర నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు డిఆర్డిఓ, సిపిఓ, కలెక్టరేట్ సిబ్బంది, పరిశ్రమల అధికారులతో  ఎస్సిఏ, సిఎస్ఆర్, డియంఎఫ్ఎ నిధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-15 ఇప్పటి వరకు సిఎస్ఆర్ నిధులు ద్వారా 309 పనులు చేపట్టగా 35 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిలో 218 పనులు పూర్తి కాగా 54 పనులు పురోగతిలో ఉన్నాయని, 37 పనులు ప్రారంబించలేదని చెప్పారు. ప్రారంభం కాని పనులకు సంబంధించి మంజూరు చేయబడిన నిధులను వెంటనే సరెండర్ చేయాలని చెప్పారు. పూర్తయిన పనులకు సంబంధించి పనులు ప్రారంభించడానికి ముందు, పనులు జరుగుతున్న సమయంలో, పనులు పూర్తయిన ఫోటోలతో నివేదికలు అందచేయాలని చెప్పారు. అలాగే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టిన ఎస్సిఏ నిధులు గురించి ప్రస్తావిస్తూ 11.63 కోట్లతో 29 పనులు మంజూరు చేశామని వాటిలో కొన్ని పనులు పూర్తి కాగా కొన్న పనులు ప్రగతిలో ఉన్నాయని, కొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇట్టి నిధులు ద్వారా చేపట్టిన పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవని, ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయు విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్రాజు, సిసిఓ శ్రీనివాసరావు, ర.భ. ఈ ఈ భీంమ్లా, ఈఈ పంచాయతీ రాజ్ సుధాకర్, సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం, జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post