ఎస్సి, ఎస్టీ మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఈ నెల 26 నుండి ఉచిత శిక్షణ ప్రారంభం: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఈ నెల 26 నుండి ఉచిత శిక్షణ ప్రారంభం*

*గ్రూప్స్ అభ్యర్ధులకు మే 2 వ తేదీ నుండి శిక్షణ*

*తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

———————————

జిల్లాలో ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ యువతీ, యువకులకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఛాంబర్ లో అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్. ఖీమ్యా నాయక్ లతో కలిసి ఉచిత శిక్షణకు చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు ఆహ్వానించడం జరిగిందని, మొత్తం 350 మంది అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 26 నుండి ఉచిత పోలీస్ శిక్షణ తరగతులు, మే 2 వ తేదీ నుండి గ్రూప్స్ శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో గల డా.బి.ఆర్.అంబేద్కర్ భవనంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతీరోజూ మధ్యాహ్నం అభ్యర్థులకు భోజన వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి కె.భాస్కర్ రెడ్డి, బీసీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, జిల్లా విద్యాధికారి డా.రాధాకిషన్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాఘవేందర్, డీఆర్డీఓ మదన్ మోహన్, మైనారిటీ కార్యాలయం ఓఎస్డీ సర్వర్ మియా, తదితరులు పాల్గొన్నారు.
————————————-

Share This Post