ఎస్సి సంక్షేమ హాస్టళ్లలో మౌళిక సదుపాయాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయింపు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఎస్సి సంక్షేమ హాస్టళ్లలో మౌళిక సదుపాయాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయింపు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లాలోని 14 ఎస్సి సంక్షేమ హాస్టళ్లలో తాగు నీరు, విద్యుత్, పారిశుధ్యం ఇతర రిపేర్లకై ఒక్కో హాస్టల్ కు రూ. 2 లక్షల చొప్పున కేటాయించడం జరిగిందని  వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వార్డెన్లను ఆదేశించారు.  బుధవారం సాయంత్రం తన ఛాంబర్ లో ఎస్సి సంక్షేమ హాస్టల్ వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ వసతి గృహాల్లో ఉన్న సౌకర్యాలు, సమస్యల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ప్రతి వసతి గృహంలో ప్రభుత్వం ద్వారా జారీ చేసిన మొడల్ మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని మెనూ సూచిక బోర్డు విధిగా ఫ్లెక్సీ పై బయట పెట్టాలని ఆదేశించారు.  పిల్లలకు కాస్మటిక్ చార్జీలు ఎంత ఎప్పటి వరకు ఇచ్చారని ఆరా తీశారు.  నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ప్రతి విద్యార్థికి అందినాయ లేదా అని, ప్రత్యేక స్టడీ కై ట్యూషన్ ఎన్ని వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వార్ధన్లు బదులిస్తూ  వారం రోజుల్లో మెనూ బోర్డు పెట్టుకుంటామని, విద్యార్థులు అందరికి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల తో పాటు బట్టలు, దుప్పట్లు, బేడీషీట్ లు,  షూస్ లు, స్లిప్పర్ లు అందజేయడం జరిగిందని, కాస్మొటిక్ చార్జీల కింద నెలకు 62 రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుందని తెలియజేసారు.  స్పందించిన కలెక్టర్ త్వరలోనే వసతి గృహాలను సందర్శిస్తానని ఎక్కడైనా తేడాలు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఇప్పుడు మంజూరు చేస్తున్న అత్యవసర సంక్షేమ నిధి నుండి వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు మిషన్ భగీరథ తాగు నీరు, ఫ్యాన్లు, దర్వాజాలు, కిటికీలు ఇతర రిపేర్లు చేయించుకోవాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్సి సంక్షేమ అభివృద్ధి అధికారి రాంలాల్, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post