ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ చట్టాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

ప్రచురునార్ధం

వరంగల్

ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ చట్టాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
అన్నారు.

Sc st అట్రాసిటీ కేసుల పైన శుక్రవారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో కలెక్టర్ పి.ప్రావీణ్య అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్, మానటరింగ్ సమావేశం జరిగింది

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరగా చార్జిషీట్ నమోదు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు తెలిపారు

అదే విధంగా కేసులు నమోదై నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్న బాధిత ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరిగి త్వరగా నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు

వరంగల్ జిల్లా పరిధిలో 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయని… వాటి దర్యాప్తు కూడా త్వరగా పూర్తి కావాలన్నారు

నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితి లో కేసుల నుంచి తప్పించుకోకుండా చూసి వారికి చట్ట పరిధిలో తగిన శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు

ప్రతీ నెల 30 వ తేదీన జరిగే సివిల్స్ రైట్స్ డే కి సంబంధించి అందరికి సమాచారం అందించాలన్నారు

ఈ సమావేశం లో సెంట్రల్ DCP బారి,డిసిపి ఈస్ట్ జోన్ వరంగల్ కరుణాకర్, అగ్రికల్చర్ JD ఉషా దయాల్, యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇందిర, బీసీ వెల్ఫేర్
శంకర్ నాయక్, కమిటీ సభ్యులు బిర్రు మహేందర్, మాంకాల యాదగిరి, పాలకుర్తి విజయ్ కుమార్, భూక్య హుస్సేన్,నమిండ్ల చిన్నస్వామి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు,
సిహెచ్ సమ్మయ్య స్పందన సర్వీస్ సొసైటీ సభ్యులు,
కే శోభారాణి ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్, వాసం సాంబయ్య శ్రీనివాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తదితరులు పాల్గొన్నారు

Share This Post