ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 30 (సోమవారం).

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ఆయా కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు మరియు బాధితులకు జరిగిన లబ్ధిపై కమిటీ సభ్యులు చర్చించారు. ముఖ్యంగా జిల్లాలో 109 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వివిధ స్థాయిలలో పెండింగ్లో ఉన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సభ్యులు కోరారు. అదే విధంగా జిల్లా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అంబేద్కర్ భవనాల నిర్మాణానికి నిధులు అందుబాటులో ఉన్నాయని స్థలాలు కేటాయించాలని, గ్రామాలలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి ఎస్సీ,ఎస్టీలతో పాటు మిగతా ప్రజానీకానికి అవగాహన కల్పించాలని తద్వారా ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను నిరోధించగలమని, దాదాపు అన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో భూతగాదాలు ఎక్కువశాతం ఉన్నందున రెవెన్యూ అధికారులు ఎస్సీ,ఎస్టీల భూముల రిజిస్ట్రేషన్ లో ప్రత్యేక చొరవ చూపాలని, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినప్పుడు బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు త్వరగా స్పందించాలని, పలిమెల మండలం పంకెన పరిసర గ్రామాలలో సుమారు 700 ఎకరాల ఎస్టి భూములు సుదూర ప్రాంతంలో గల బిసి,ఓసి ల పేర్ల పై పట్టా ఉందని కానీ కాస్తులో గత 30 సంవత్సరాలుగా గిరిజనులే ఉన్నారని వారి పేరుపై పట్టాలు చేయించి అక్రమ పట్టాలు పొందిన ఇతరుల పై చర్యలు తీసుకోవాలని, కాటారం మండలం మద్దులపల్లి సమీపంలో ప్రభుత్వ అసైన్డ్ భూములను అగ్రవర్ణాల వారు అన్యాక్రాంతం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దానిని అరికట్టి స్థానికంగా ఇల్లులేని ఎస్సీలకు ఇళ్ల స్థలాలు అందించాలని మరియు ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించాలని, మహాముత్తారం మండలం వజినేపల్లి గ్రామంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందజేసిన 150 ఎకరాల భూములకు సంబంధించి లబ్ధిదారులకు సరైన భూమి పొజిషన్ ఇవ్వక పోవడం వలన లబ్ధిదారుల సాగుచేసుకుంటున్న భూములను ఇతరులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని వారికి న్యాయం చేయాలని, గొల్లబుద్ధారం పంప్ హౌస్ భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని తదితర సమస్యలపై సభ్యులు కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ చట్టాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరగా చార్జిషీట్ నమోదు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కేసులు నమోదై నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్న బాధిత ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరిగి త్వరగా నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవన నిర్మాణాలకు స్థలాలను పరిశీలించాలని అదేవిధంగా పలిమెల, పలిమెల మండలంలో ఎస్టీలు సాగుచేసుకుంటున్న భూమిని ఇతరుల పేరు మీద పట్టాలు పొందడం పై దర్యాప్తు చేసి నివేదిక అందించాలని ఆర్డీవో శ్రీనివాస్ ను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో ఎస్సీలకు అందజేసిన భూముల వివరాలను మరియు వాటిని సాగుచేసుకుంటున్న వారి వివరాలను అందజేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లును ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు సంపత్ రావు, బోనాల కిషన్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, సెక్షన్ అధికారి జలంధర్ రెడ్డి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు డిపిఆర్ఓ బి.రవికుమార్, అంబాల చంద్రమౌళి,బోడ రాజు, రాసపెళ్లి భద్రయ్య, సమ్మయ్య దొర, సంతోష్ నాయక్, ఎస్సి అభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డీపీఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది

Share This Post