ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్ dr. సుధీర్ కుమార్ తో కలసి కలెక్టర్ పాల్గొన్నరు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసుల నుంచి తప్పించుకోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్షపడేలా చూడాలన్నారు. హనుమకొండ జిల్లా లో అండర్ ఇన్విస్టిగేషన్ కింద 11 కేసులు ఉన్నాయని,పెండింగ్ ట్రయల్ కేసులు కింద 29 కేసులు ఉన్నాయ ని, అన్నారు.మళ్లీ నిర్వహించే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నాటికి కేసుల దర్యాప్తులో పురోగతి ఉండాలన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధితులకు సరైన రీతిలో, సమగ్రంగా అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేలే.. కమిటీ సభ్యులు సహకారం అందించాలని సూచించారు. బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ “ఎస్సీ, ఎస్టీల కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉంది, న్యాయం చేసే విషయంలో ఎక్కడ ఆలస్యం జరగకూడదు, ఎక్కడైనా న్యాయం ఆలస్యం అయినట్లయితే అక్కడ బాధితులకు నష్టం జరుగుతుంద”ని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగం తో పాటు అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి అని అన్నారు.