ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత శాఖల అధికారులకుఆదేశించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 7:–
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత శాఖల అధికారులకుఆదేశించారు.

శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచార సంఘటనలపై జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావ్, డీఎస్పీలు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ ఎస్టీ అత్యాచార సంఘటనలకు సంబంధించిన కేసులను కేసు వారీగా సమీక్షించారు. వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని,
సకాలంలో బాధితులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జాప్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. అట్రాసిటీ కేసుల విషయంలో పోలీస్ శాఖలో ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని డిఎస్పి లకు సూచించారు. బాధితులకు అందాల్సిన పరిహారం సకాలంలో అందేలా చూడాలన్నారు. ఈ విషయమై ఆయా శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు అఖిలేష్ రెడ్డి, డీఎస్పీలు బాలాజీ శంకర్ రాజు, భీమ్ రాజు, రెవిన్యూ డివిజనల్ అధికారులు నగేష్, విక్టర్, అంబదాస్, రమేష్, కమిటీ సభ్యులు రవీందర్ నాయక్, మహేశ్వర్, నారాయణ జాదవ్ వెంకటేశం, అన్నపూర్ణ ,సాగర్, తదితరులు పాల్గొన్నారు

Share This Post