ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ బాధితులకు సత్వర నాయం జరిగేలా చర్యలు. మూఢనమ్మకాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. జిల్లా ఎస్సి ఎస్ టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య.

జిల్లాలోని ఎస్సీ, ఎస్ .టి., అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, ఏ ఏఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసుల నుంచి తప్పించుకోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్షపడేలా చూడాలన్నారు. జిల్లా లో అండర్ ఇన్విస్టిగేషన్ కింద 14 కేసులు ఉన్నాయని, పెండింగ్‌ ట్రయల్‌ కేసులు కింద 70 కేసులు ఉన్నాయని అన్నారు. మళ్లీ నిర్వహించే విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నాటికి కేసుల దర్యాప్తులో పురోగతి ఉండాలన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధితులకు సరైన రీతిలో సమగ్రంగా అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేల కమిటీ సభ్యులు సహకారం అందించాలని సూచించారు. బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.

జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రజలు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుడుంబా నియంత్రణకు పోలీస్ ఎక్సైజ్ శాఖ సమన్వయంతో అరికట్టాలని గుడుంబా బాధితులకు బైండోవర్ చేసి పునరావాసం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
జిల్లాలో అంబేడ్కర్ కమ్యూనిటీ హాలు మంజూరు కాగా, వాటి నిర్మాణానికి స్థల పరిశీలనకు సంబంధిత మండలాల తహసీల్దార్లు నివేదికలు పంపుటకు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మండలానికి ఒకరు చొప్పున దళిత దివ్యాంగులకు దళిత బంధు పథకంలో ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు.
ఈ సమావేశంలో విజిలెన్స్ మాటరింగ్ కమిటీ సభ్యులు జిల్లాలో కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని సానుకూలంగా స్పందించారు.
పరిష్కరించేందుకు అధికారులు సమన్వయం చేసుకొని చట్ట ప్రకారం పరిష్కరించాలని సూచించారు.
పోలీసు స్టేషన్ పరిధిలో ఏదైనా ఎస్సీ.ఎస్టీ.ల ధరఖాస్తు లు వచ్చినట్లు అయితే పరిశీలించి త్వరిత గతిన కేసులు నమో చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాట్స్ అప్ గ్రూప్ ద్వారా తెలియచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ లకి ఏదైనా సమస్యలు ఉన్నట్లు అయితే తన దృష్టికి తీసుకు రావాలని అన్నారు.
గుడుంబా మనీ లాండరింగ్ వంటి అధిక వడ్డీ వ్యాపారులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అండ్ ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
కమలాపురం మంగపేట మండలంలో ఉన్న భూముల పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టలని తాహసిల్దార్లను ఆదేశించారు.
ఎస్సీ హాస్టల్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో నీటి సౌకర్యం కరెంట్ సౌకర్యం కోసం సంబంధిత అధికారులు ఎస్టిమేషన్ వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ని ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చ అందించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్ ఎస్సీ వెల్ఫేర్ అధికారి పి. భాగ్యలక్ష్మి,ఎస్సి కార్పొరేషన్ ఈడీ తుల రవి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు నక్క బిక్షపతి జన్ను రవి చుంచు రవి రాస మల్ల సుకుమార్ మహేష్ నాయక్ తాహసిల్దారులు ఎం శ్రీనివాస్ సంజీవ రాజకుమార్, ఎం పిడిఓ ఎగ్బాల్ హుస్సేన్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post