ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచరణార్థం

ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

*ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
——————————–
పెద్దపల్లి, డిసెంబర్ -06:
——————————–
ఎస్సీ, ఎస్టీ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంభందిత కమిటీ సభ్యులకు, పోలీస్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీ నారాయణ కుమార్ దీపక్ లతో కలిసి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాధితులకు నష్టపరిహారం చెల్లింపులపై చర్చించారు. నూతనంగా ఏర్పడిన విజిలెన్స్ కమిటీ సభ్యులకు కలెక్టర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కల్పించారు.

విజిలెన్స్ కమిటీ సభ్యులు సాయిరాం నాయక్ సూచన మేరకు ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం విధిగా నిర్వహించి , ఎస్సీ, ఎస్టీ కేసుల పై చర్చించాలని కలెక్టర్ సూచించారు.

2021 డిసెంబర్ 31 నాటికి కోర్ట్ లో 169 కేసులు పెండింగ్ లో ఉండగా, 2022 జనవరి ఒకటి నుండి అక్టోబర్ 31 వరకు 18 కేసులు నమోదు అయినాయని, మొత్తం 187 కేసులకు గాను 30 పరిష్కారం కాగా, 157 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

2022-23 సంవత్సరానికి గాను 84 కేసులకు గాను 37 కేసులకు 28 లక్షల 37 వేల 500 రూపాయలు నష్ట పరిహారం అందించగా, ఇంకను 47 కేసులకు నష్టపరిహారం చెల్లించవలసి ఉన్నదని తెలిపారు. బ్యాంక్ అకౌంట్ డీటైల్స్, బడ్జెట్ తెప్పించి పెండింగ్ వాటికి చెల్లింపులు చేయాలని తెలిపారు. పోలీస్ వారి ఛార్జ్ షీట్ ప్రకారం పెండింగ్ లేకుండా వెంట వెంటనే పరిశీలన చేసి క్లియర్ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో తదుపరి కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చూడాలని, తదుపరి కమిటీ సమావేశానికి ప్రస్తుతం ఉన్న పెండింగ్ కేసులను క్లియర్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా షెడ్యూల్ తెగల అధికారి ఎం. గంగారం, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నాగలేశ్వర్, గోదావరిఖని ఏ.సి.పి. గిరిప్రసాద్, కరీంనగర్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కుమార్, కమిటీ సభ్యులు సూరవెంకటేశం, మధునయ్య, రాజ్ కుమార్, సాయిరాం నాయక్, ఎన్.జి. ఓ లు రాజయ్య, రాజగోపాల్, టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్ సూపరింటెండెంట్ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post