ఎస్సీ ఎస్టీ బిసి లబ్ధిదారులకు 54 కోట్ల రూపాయలు వ్యయంతో రుణాలను అందించాo :జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రచురణ*
ములుగు జిల్లా అక్టోబర్ 21( గురువారం )
జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు వృత్తి నైపుణ్యంలో మెలుకువలు నేర్చుకున్న ఎస్సీ ఎస్టీ బిసి లబ్ధిదారులకు 54 కోట్ల రూపాయలు వ్యయంతో రుణాలను అందించామన్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు
గురువారం రోజున గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా లీలా గార్డెన్లో ఏర్పాటుచేసిన నిరుద్యోగ యువత, మహిళా సంఘాలకు, స్వయం ఉపాధి రుణ మేళ ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు వృత్తి నైపుణ్యంలో మెలుకువలు నేర్చుకున్న ఎస్సీ ఎస్టీ బిసి లబ్ధిదారులకు 54 కోట్ల రూపాయలురుణాల కు సంబంధించిన చెక్కులను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు అనంతరం బ్యాంకు రుణ మేళ స్టాల్స్ను సందర్శించి కలెక్టర్ ప్రారంభించారు కెనరా బ్యాంక్, ఏపీజీవీబీ, ఎస్బిఐ, బి సి సి బి, కోటక్ మహేంద్ర, ఖమ్మం బి సి సి బి, డి ఆర్ డి ఎ యూత్ వెల్ఫేర్ పి ఎం ఈ జి పి పి హెచ్డిఎఫ్సి స్టాల్స్ ఏర్పాటు చేసి హార్దిక రుణాలు అందించే విధంగా పూర్తి సమాచారంతో ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాటు చేశారు ఈ రుణ విస్తరణ కార్యక్రమాలు ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రుణ మేళ ను ఏర్పాటు చేశామని ముందుగానే వివిధ బ్యాంకుల అధికారులతో సంప్రదించి ఏర్పాటు చేశామన్నారు ఈరోజు క్రెడిట్ అవుట్ రీచ్ విస్తరణ లో భాగంగా ములుగు జిల్లా లో అన్ని బ్యాంకుల సహాయ సహకారాలతో స్టాల్స్ ఏర్పాటు చేసి వివిధ రకాల స్కీమ్ గురించి వివరించి అర్హత ఉన్న లబ్ధిదారులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మహిళా సంఘాలు,

సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మహిళా సంఘాలకు రుణాలు అందించడం జరిగిందని అన్నారు దీనిలో భాగంగా హౌసింగ్ లోన్స్ కు 7 కోట్ల రూపాయిలు, అదే విధం గా పర్సనల్ లోన్స్ కు 37 లక్షలు ,పెన్షన్ లోన్స్ కు 10, లక్షలు కార్ లోన్ లకు 20 లక్షలు, హార్వెస్టర్ లోన్స్ కు 23 లక్షలు , ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ రుణాలకు 6 కోట్ల 80 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, ఎస్ ఎన్ ఈ లోన్స్ కు 2 కోట్లు మరియు వివిధ లోన్స్ కు 4 కోట్లు వివిధ రుణాలు అందించి అధిక వృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు నిరుద్యోగ యువతకు
ములుగు వెంకటాపూర్ గోవిందరావుపేట గ్రామాలకు చెందిన వారు 112 మంది దరఖాస్తు చేసుకోగా 26 మంది అర్హత సాధించారని వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కొరకు సిపెట్, అపోలో ఫార్మసీ సంస్థలు ముందుకు వచ్చాయని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి అన్నారు
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ డీజీఎం రవీంద్ర గురువు, ఎల్ డి ఎం ఆంజనేయులు కెనరా బ్యాంక్ ఏజీఎం విష్ణు మనోహర్ జోషి, యు బి ఐ చీఫ్ మేనేజర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి ,డి ఆర్ డి ఏ నాగ పద్మజ, జి ఎన్ డి ఐ సి శ్రీనివాస్ మొదలగు జిల్లా అధికారులు వివిధ బ్యాంక్ మేనేజర్లు స్వయం సహాయక సంఘాల సభ్యులు నిరుద్యోగ యువత పాల్గొన్నారు

Share This Post