ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్ లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను గుర్తించి ఎస్టిమేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది05.08.2021 ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్ లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను గుర్తించి ఎస్టిమేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లుకు సంబంధించి ఎస్టిమేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ లు ఉంటే గుర్తించి మరమ్మతులు చేయించాలని కోరారు. రజకులకు సంబంధించి లాండ్రీ షాపులకు, దోబీ ఘాట్ లకు, నాయి బ్రాహ్మణులకు సంబంధించి సెలూన్ షాపులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ట్రాన్స్కో అధికారులు ఆదేశించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తుందని పేర్కొన్నారు. పల్లె ప్రగతి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలని కోరారు. హోమ్ సీడ్ ప్లాంటేషన్ లో ఇచ్చిన మొక్కలు ప్రజలు నాటుకునే విధంగా చూడాలన్నారు. ఇండ్ల వారీగా పంపిణీ చేసే మొక్కల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని కోరారు. గ్రామాలలో సేకరించిన విరాళాల మొత్తం వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 10లోగా పూర్తిచేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో డి పి ఓ సునంద, జడ్పీ సీఈవో సాయా గౌడ్, పంచాయతీ రాజ్, విద్యుత్తు, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post