ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిన్న తరహా వ్యాపార పథకముల ద్వారా యూనిట్ల పంపిణీ : వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన తేది:5.7. 2021
వనపర్తి

చిన్న తరహా వ్యాపార పథకముల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొంది అభివృద్ధి సాధించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
సోమవారం వనపర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు, వివిధ రకాల ఉపాధి యూనిట్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత మహిళలు శిక్షణ పొంది వివిధ రంగాలలో ఉపాధి పొందవచ్చని అన్నారు. వనపర్తి పట్టణం పరిసర ప్రాంతాల గ్రామాలలో దళిత మహిళలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు పొంది కూరగాయల సాగు చేపట్టి ఉపాధి పొందవచ్చని అన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్డీవో అమరేందర్, లక్ష్మీ శేఖర్ నాయక్, జిల్లా ప రిషత్ 6వ స్థాయి సంఘం జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, కోళ్ల వెంకటేష్, సభ్యులు భానుప్రసద్ , లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
……………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయనైనది.

Share This Post