ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుటకు చెక్కుల పంపిణీ : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన తేది:06.09.2021. వనపర్తి.

షెడ్యూల్ కులాల అభ్యున్నతికి కృషి చేయాలని చిన్న, మధ్యతరహా పరిశ్రమ లు స్థాపించుటకు తెలంగాణ ప్రభుత్వం రుణాలు మంజూరు చేయుటకు కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
సోమవారం వనపర్తిలోని మంత్రి నివాసంలో చెక్కుల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం100 శాతం సబ్సిడీతో రూ.50,000/- రుణాలను మంజూరు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఎస్సీ కులాలు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా స్వావలంబన పొందాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని మంత్రి సూచించారు. అనంతరం 35 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి.మల్లికార్జున్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు ఎంపీపీ, చైర్మన్ కరుణశ్రీ, కోళ్ల వెంకటేష్, ఎస్సీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
……………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post