ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 2020-21 సం. కార్యాచరణ ప్రణాళిక పై అధికారులతో సమీక్ష

ఎస్సీలకు రుణ సహాయానికి సంబంధించిన 2020-21 కార్యాచరణ ప్రణాళిక అమలును మరింత వేగవంతం చేయాల్సిందిగా మంత్రి కొప్పులఈశ్వర్ అధికారులను ఆదేశించారు

👉 గతేడాదికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు,ఈ ఆర్థిక సంవత్సరంలో రూపొందించాల్సిన ప్రణాళిక గురించి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.

మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహూల్ బొజ్జ,ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ బండా శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు

 

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల కామెంట్స్

————————————-

👉 ఎస్సీలకు రుణ సహాయానికి సంబంధించిన 2020-21 కార్యాచరణ ప్రణాళిక అమలును మరింత వేగవంతం చేయాలి

👉 వృత్తి నైపుణ్యత లేని వాటిని ఈ నెలాఖరులోగా, వృత్తి నైపుణ్యానికి సంబంధించిన రుణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలి

👉ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలో ఏ యే అంశాలు చేర్చాలో వెంటనే ఖరారు చేయండి.

ఈ నెలాఖరులో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరపాలని సమావేశంలో నిర్ణయించారు

👉దళితుల సంక్షేమం,ఉన్నతి,రుణ ప్రణాళిక అమలు, ఉపకార వేతనాలు,వసతి గృహాల నిర్వహణ,స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దడం,వచ్చే బ్యాంకర్ల సమావేశంలో ఎస్సీల సముద్ధరణకు సంబంధించిన అంశాలను చేర్చడం తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చిద్దామని మంత్రి చెప్పారు.

మంత్రి అసెంబ్లీ నియోజకవర్గం ధర్మపురిలో ఎస్సీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు

👉యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు గాను ఆ యా వృత్తులలో శిక్షణా కార్యక్రమాలను వెంటనే చేపట్టాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

Share This Post