ఎస్సీ లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అన్ని శాఖలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను విధిగా నిబంధనల మేరకు ఖర్చు చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఎస్సీ లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అన్ని శాఖలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను విధిగా నిబంధనల మేరకు ఖర్చు చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో రాజర్షి అధ్యక్షతన zahirabad, అందొల్ శాసన సభ్యులు మాణిక్ రావ్,చంటిక్రాంతి కిరణ్ తో కలిసి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎస్సీ సబ్ ప్లాన్ అమలు తీరును అన్ని శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. వ్యవసాయ,మెప్మా,హార్టికల్చర్, పంచాయతీ రాజ్,విద్య,విద్యుత్,అర్ డబ్లు ఎస్,ప్రణాళిక శాఖ,శిశు సం్షేమశాఖ,గిరిజన, పరిశ్రమలు, పశుసంవర్ధక,భూగర్భ జలశాఖల అధికారులతో ఆయా శాఖలకు కేటాయించిన నిధులు,అందులో ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఖర్చుచేసిన నిధులు , లబ్ధిదారులు తదితర అంశాలను సమీక్షించారు. ఎస్సీ సబ్.ప్లాన్ నిధులు త్వరితగతిన ఖర్చు చేయాలని సూచించారు. ఆయా శాఖల ద్వారా వివిధ పథకాల్లో ఎస్సీ లబ్ధిదారులకు అందిస్తున్న రుణాలు ,సబ్సిడీ యూనిట్లు తదితర అంశాలపై ఎస్సీ లకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలలో అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకునీ, లబ్ధి పొందేలా వారికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ఎస్సీ కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలన్నారు.

ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post