ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్
సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పాఠశాలలో, కళాశాల లో చదువుతున్న ఎస్సి విద్యార్థుల డాటా బేస్ ప్రక్రియ పూర్తి చేసి ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయబడిన పాఠశాలలో పనులు వేగవంతం చేయాలని నాణ్యత తప్పనిసరని ఈ సందర్భంగా సూచించారు.
ఉపాధ్యాయులు అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేసుకోవాలని అన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రాసెస్ ఒక బాధ్యతగా నిర్వర్తించాలన్నారు.
ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు ప్రక్రియలో ఏలాంటి సమస్యలు తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లాలో గప కళాశాలలో పెండింగ్లో ఉన్న ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై వి గణేష్, విద్యాశాఖ అధికారి జి పానిని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి అధికారి పి భాగ్యలక్ష్మి ఎల్డియం రాజ్ కుమార్ క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి డి ఏ ఓ వెంకటేశ్వర్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ , మండల విద్యాశాఖఅధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post