ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ఉపకార వేతనాలు మంజూరు, పెండింగ్ అంశాలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

శుక్రవారం ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ప్రీ, పోస్ట్ మెక్రటిక్ ఉపకార వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు చెల్లింపులు క్లియర్ చేయాలని గత మూడు సంవత్సరాల నుండి క్లియర్ చేయకుండా ఎందుకు పెండింగ్లో ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వద్ద, కళాశాలలు వద్ద ఉపకార వేతనాల దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరం క్లియర్ చేయాలని గతంలోనే ఇట్టి అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఎందుకు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపకార వేతనాలు సమస్య మీ దగ్గర పెండెన్సీ లేకుండా పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 2017 నుండి 2016-2022 ఆర్థిక సంవత్సరాలకు 22818 దరఖాస్తులుండగా వాటిలో 518 విద్యార్దిస్థాయిలోను, 1150 కళాశాలల స్థాయిలోను, 474 ఆధార్ అనుసంధాన ప్రక్రియలోను, 1086 దరఖాస్తులకు కళాశాలలు హార్డు కాపీలు, 1624 తిరస్కరణ స్థాయిలోను ఉన్నట్లు చెప్పారు. ఇన్ని సంవత్సరాల నుండి ఉప కార వేతనాల సమస్యను క్లియర్ చేయకుండా ఎందుకు పెండింగ్లో ఉంచారని పరిష్కరించాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రిన్సిపాళ్లను ప్రశ్నించారు. నిరుపేద వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎంతో అవసరమని చెల్లింపులు చేయకుండా సంవత్సరాల నుండి పెండింగ్ ఎలా ఉంచుతారని, సత్వరం పరిష్కరించకపోతే కళాశాలలు లైసెన్సులు రద్దు చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కానీ ప్రిన్సిపాళ్లపై వివరణ తీసుకుని తనకు నివేదిక అందచేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆధార్కార్డు అనుసంధానం చేయకుండా ఎందుకు పెండింగ్లో ఉంచారని, మూడు సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుండి 2020 వరకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాల సమస్యను వారం రోజుల్లో పరిష్కరించు విధంగా సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు చర్యలు తీసుకోవాలని, వారం తరువాత కూడా పరిష్కారం చేయకపోతే తనకు కారణాలను తెలియచేస్తూ నివేదికలు అందచేయాలని చెప్పారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లింపు చేయడానికి నిధులు ఉన్నాయని తక్షణం అప్డేట్ చేయడం వల్ల వారి ఉపకార వేతనాలు మంజూరు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. ఉపకార వేతనాలు సమస్యను పరిష్కరించ కుండా కాలయాపన చేస్తే సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరురుగుతుందని చెప్పారు. వారంలో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని, తనకు సమగ్ర నివేదికలు అందచేయాలని డిఎస్సీడిఓను ఆదేశించారు. వచ్చే శుక్రవారం ఇదే అంశాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అప్పటి వరకు పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ కొత్త వేరియంట్స్ వస్తున్నాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని చెప్పారు. వ్యాక్సిన్ కొరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రతి అధికారి వ్యాక్సిన్ జరిగినట్లు ధృవీకరణ అందచేయాలని చెప్పారు. అజాగ్రత్త వల్ల వ్యాధి ప్రమాదం పొంచి ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని

 

ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి. సులోచనారాణి, సహాయ సంక్షేమ అధికారులు వెంకటేశ్, శివభాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Share This Post