ఎస్సెస్సి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ఎస్సెస్సీ,ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

– *ఎండాకాలం దృష్ట్యా విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి*

——————————
జిల్లాలో జరుగనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీ అనురాగ్ జయంతి అన్నారు.
పరీక్షలకు ప్రారంభం ముందే ప్రతి పరీక్ష కేంద్రాన్ని DIEO,DEO లు సందర్శించి త్రాగునీరు, విద్యుత్, ప్యాన్ లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయో లేవో పరిశీలించాలనీ అన్నారు. ఇంకా ఏమైనా సౌకర్యాలు చేపట్టాల్సి ఉంటే వెంటనే సంబంధిత శాఖల అధికారులతో పనులు చేపట్టాలని అన్నారు.

సోమవారం IDOC మినీ మీటింగ్ హాల్ లో సమావేశ మందిరంలో ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు మే 23వ తేదీ నుంచి ,జూన్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలవరకు జరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అందులో 6,379 మంది రెగ్యులర్ విద్యార్థులు, 5 మంది ప్రైవేట్ గా విద్యార్థులు, మొత్తం 6,382 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

ఎండాకాలం దృష్ట్యా విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను, చీప్‌ సూపరింటెండెంట్‌లను నియమించాలని ఆయన ఆదేశించారు.
ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షల కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లుగా నియమించాలని అన్నారు. తహశీల్దార్ లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 141 సెక్షన్ అమలయ్యేలా చూడాలన్నారు.

పదోతరగతి పరీక్ష పత్రాలను జిల్లా ట్రెజరీలో భద్రపర్చాలని, తగిన పోలీసు బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు రవాణా చేయాలని ఆదేశించారు.

 

పరీక్ష కేంద్రాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని, 108 వాహనాలను వినియోగించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. పది, ఇంటర్‌ పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని సెస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు పరీక్షకేంద్రాలకు సకాలంలో వచ్చి వెళ్లడానికి వీలుగా బస్సులను పరీక్ష కేంద్రాల రూటులో నడిపించాలని ఆర్టీసీ అధికారులని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షల సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 

*మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు*

జిల్లాలో ఇంటర్మీడియట్‌ రాత పరీక్షలు మే 6 నుంచి మే 24 వరకు ఉదయం 9 గంటల ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి
సంవత్సరం 4,474 మంది, రెండో సంవత్సరం 4,462 మంది మొత్తం 8,936 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 8 పోలీస్ స్టేషన్లో పశ్న పత్రావలి భద్ర పరుస్తామని తెలిపారు. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక సిట్టింగ్ స్క్వాడ్, 2 కస్తోడియన్ పాయింట్స్ రెండు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కు అధికారులు తెలిపారు

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్, DEO డి రాధా కిషన్, DIEO శ్రీ CH మోహన్, DTO శ్రీమతి నీరజ, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

——————————

.

Share This Post