ఎస్.ఆర్.ఆర్ కళాశాల లో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్,శ్యాం ప్రసాద్ లాల్

ఉప ఎన్నిక కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

నవంబర్ 2న జరుగు హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలలోనీ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదివారం పరిశీలించారు. అక్టోబర్ 30న జరిగే హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వి వి ప్యాట్లు భద్ర పరచడంతో పాటు నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కో సం కళాశాలలోని ఆడిటోరియం హాల్, తరగతి గదులు, ఇండోర్ స్టేడియం లో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్ల గురించి అదనపు కలెక్టర్లు జీవి. శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్ లతో చర్చించారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కోసం ఏర్పాటుచేసిన ఫర్నిచర్, సీసీ కెమెరాలు, బారికేడ్లు, షామియానాలు, లైటింగ్ తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల ముందు నుంచి జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిని కౌంటింగ్ రోజు ఒకపక్క మూసివేయాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలోని మైదానాన్ని పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహించుట గాను కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన రెండు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహించుటకు రెండు హాల్స్ లలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ టేబుల్స్, కుర్చీల అమరికను, బారికేడ్లను, ఇనుప జాలీ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఎన్నికల అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, తహసిల్దార్లు , అధికారులు పాల్గొన్నారు

Share This Post