ఎస్.కె.ఎస్ డాటాలో ఉన్నవారికి దళితబందు లో మొదటి ప్రాదాన్యత ఇవ్వాలి

ఎస్.కె.ఎస్ డాటాలో ఉన్నవారికి దళితబందు లో మొదటి ప్రాదాన్యత ఇవ్వాలి

దళితబందు యూనిట్లను త్వరితగతిన పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0 0 0

     ఎస్.కె.ఎస్ డాటాలో ఉన్నవారికి దళిత బందులో మొదటి ప్రాదాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

     బుదవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో దళితబందు గ్రౌండింగ్ పై క్లస్టర్ అధికారులు, గ్రౌండిగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, యంపిడిఓలు, బ్యాంకర్లతో అయన సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజక వర్గాoలో ఎస్.కె.ఎస్ డాటాలో ఉన్నవారికి మొదటి ప్రాదాన్యం ఇవ్వాలని, ఒక కుటుంబంలో దళితబందు లబ్దిపొంది తరువాత పెళ్లైన రెండవ కుమారునికి కూడా దళితబందు వర్తిస్తుందని, ఆ తదుపరి ప్రభుత్వ ఉద్యోగులకు, ఆశావర్కర్లకు వర్తిస్తుందని అన్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతా వివరాలు, ఆదార్ కార్డు తదితర దృవీకరణలను ఎంపిడిఓలు మున్సిపల్ కమీషనర్ల, క్లస్టర్ ఆఫీసర్లు పరిశీలించాలని అన్నారు. ఎస్.కె.ఎస్ డాటాలో ఉండి బ్యాంకులో దళితబందు డబ్బులు జమకానట్లయితే సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని బ్యాంకులో డబ్బులు జమ అయి ఫర్మ్ లేనట్లయితే వాటిని పరిశీలించాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో ఆడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, ఎల్డిఏమ్ ఆంజనేయులు, డిఆర్డిఏ శ్రీలతారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గోన్నారు

Share This Post