ఎస్.టి.,ఎస్.సి.,గౌడ కమ్యూనిటీలకు లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు-జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను 2021-23 సంవత్సరానికి ఎస్.టి., ఎస్.సి.,గౌడ కమ్యూనిటీలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్ మేరకు లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ కోర్ట్ హాలులో ఎక్సైజ్, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బి.సి. అభివృద్ధి అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు. రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో 234 రిటైల్ మద్యం షాపులకు గాను సరూర్ నగర్ డివిజన్ లో ఎస్.టి.లకు 2, ఎస్.సి.లకు-11, గౌడ సామాజిక వర్గాలకు 25, శంషాబాద్ డివిజన్ లో ఎస్.సి.లకు 6, గౌడ సామాజిక వర్గాలకు 9 రిటైల్ మద్యం షాపులు కలెక్టర్ డ్రా తీసి కేటాయించారు. శంషాబాద్ డివిజన్ లో ఎస్.టి.లు ఎవరు లేనందున ఎస్.టి.లకు కేటయించలేదని కలెక్టర్ తెలిపారు
జిల్లాలో 234 మద్యం దుకాణాల లో 53 దుకాణాలు ఎస్.టి.లు, ఎస్.సి.లు, గౌడ వర్గాలకు ప్రభుత్వ,ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ననుసరించి కేటాయించగా 181 మద్యం షాపులు జనరల్ కేటగిరి కింద మిగిలినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ.హరిప్రియ, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి.రవీందర్ రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ రావు, శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్, జిల్లా అసిస్టెంట్ బి.సి.అభివృద్ధి అధికారి నీరజ రెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రామేశ్వరి , సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post