జిల్లాలోని ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసననభ్యులు ఆత్రం సక్కుతో కలిసి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ కేసుల సoబంధిత జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ పెండింగ్ కేసులను పూర్తి స్థాయిలో పరిష్కరించి సత్వర న్యాయం జరిగేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సoబంధిత ఆర్థిక సహాయం సకాలంలో అందే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. అట్రాసిటీ కేసులు అధికంగా నమోదు అవుతున్న మండలాలు, గ్రామాలను గుర్తించి ఆ ప్రాంతాలలో సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజన్వ మండల అధికారులు, డి.ఎస్.పి.లు, ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కమిటీ అధికారిక
సభ్యులు, సoబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.