ఎస్ సి కమ్యూనిటి హాల్ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్ర్హి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి.

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

సమాజంలో వెనుకబాటుకు గురైన దళితుల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం దళిత అభివృద్ధి పథకం ప్రవేశపెట్టి దశలవారీగా అభివృద్ధి చేస్తుందని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

మంగళవారం గద్వాల పట్టణంలోని సంగాల చెరువు దగ్గర ఏర్పాటు చేసిన ఎస్ సి కమ్యూనిటి హాల్ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 75 సంవత్సరాలలో వెనుకబడ్డ దళిత జాతి ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత మేధావులతో అధికారులతో చర్చించి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్న  రీతిలో దళిత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ పథకానికి రూ. 40వేల కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నాలుగేళ్లలో జరిగే అభివృద్ధిలో భాగంగా మొదటి సంవత్సరం రూ.1200  కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందజేసి వారు ఏ రంగంలోనైనా ఉపాధి పొందేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నదని అన్నారు. అలాగే రెండు మూడు నాలుగు సంవత్సరాలపాటు గా దళిత అభివృద్ధి పథకం కొనసాగుతూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా దళితుల అభివృద్ధి తో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో అత్యంత పేదలు  ఎవరు ఉన్నారని గుర్తించి వారిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని అన్నారు. ఇంకా దళితుల అభివృద్ధి కొరకు మేధావులు సలహాలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం న్యాయం చేస్తూ విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో ముందుకు వెళుతుందని అన్నారు.రూ. 36 వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత మన రాష్ట్రానిదే అన్నారు. పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఆదుకుంటుందని అన్నారు. సమాజంలో దళితులకు సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం పేదల పక్షపాతి గా పని చేస్తూ అన్ని వర్గాలను ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనతికాలంలో నిర్మించి ఒక నది ని ఎత్తి పోసే విధంగా డిజైన్ చేసినందున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్కవరీ ఛానల్ లో ప్రసారం అయిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళితుల అభివృద్ధి కొరకు రూ. 40 వేల కోట్లు కేటాయించారని, దశలవారీగా నిధులను కేటాయించి దళితుల అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు రూ 6 కోట్లు మంజూరయ్యాయని వాటి ద్వారా ప్రతి గ్రామంలో జనాభాను బట్టి కమిటీ హాళ్ళు  నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ గ్రామంలోనైనా అత్యంత పేదరికంలో ఉన్న వారు దళితులు మాత్రమేనని గుర్తించిన ముఖ్యమంత్రి దళిత పాలసీ ప్రకటించి దళితుల అభివృద్ధికి పాటుపడ్డారని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీరాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,  ఆలంపూర్  ఎం ఎల్ ఏ  అబ్రహం , అదనపు కలెక్టర్ రఘు రామ్ శర్మ ,మార్కెట్ చైర్మన్ రామేశ్వరమ్మ, మున్సిపల్ చైర్ మెన్  బి ఎస్ కేశవ్,వడ్డేపల్లి, ఆలంపూర్, ఐజ , మున్సిపల్ చైర్మన్లు , జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

———————————————————————- జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post