ఎస్.సి.మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి షీక్యాబ్స్ వాహనాలను అందజేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్.సి.మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి షీక్యాబ్స్ వాహనాలను అందజేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
శుక్రవారం సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ లో జిల్లా ఎస్.సి.కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీక్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి చేస్తున్న కృషిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 23 మంది దళిత మహిళలకు షీ క్యాబ్స్ వాహనాలను అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితోపాటు పలు సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తూ వారు ఆర్థికంగా బలోపేతం చెందెలా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అందజేసి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అండగా నిలవడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళల భద్రతపై షీ టీములను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం జరుగుతుందని, అదే విధంగా ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళలకు షీ క్యాబ్స్ ను వినియోగించుకునేలా, దళిత మహిళలకు ఉపాధి కల్పించేందుకు అర్హులైన వారిని ఎన్నుకొని వారికి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకు షీ క్యాబ్స్ వాహనాలను అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో దళిత బంధు పథకం ద్వారా 38 వేల 400 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారు ఎంచుకున్న యూనిట్లను ఇప్పించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం దోహదపడుతున్నదని మంత్రి తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారుల చొప్పున మొత్తం కలిపి ఇంచుమించు లక్ష మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. షీ క్యాబ్స్ లబ్ధిదారులైన మహిళలను అభినందిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ మిగతా మహిళలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ప్రతీక్ జైన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, ఎస్బిఐ మేనేజర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post