ఎస్.సి. సంక్షేమ వసతి గృహలలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*.

*#నల్గొండ పట్టణం లో ఎస్.సి.బాలికల,బాలుర సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్*
సంక్షేమ వసతి గృహాల ఆవరణ లో పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య చర్యలు చేపట్టి  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్.పి.రోడ్డులో గల ఎస్.సి బాలికల వసతి గృహం, సావర్కర్ నగర్ లో గల ఎస్.సి బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహా ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. వసతి గృహా పరిసరాలను కలియ తిరిగి చెత్తా చెదారం, నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్, ప్లాస్టిక్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆహార పదార్థాల వ్యర్థాల కోసం డస్ట్ బిన్లు సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని చెత్తను తరలించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, వర్షం నీరు ఎక్కడా నిలువకుండా బిల్డింగ్ చుట్టూ రెండు ఫీట్ల మేరకు ప్లోరింగ్ చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సదుపాయం కోసం ప్రత్యేకంగా సంపులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మెనూ  ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థిని విద్యార్థులను అడిగారు. మెనూ ప్రకారం చికెన్, ఎగ్స్ అందిస్తున్నారా అని అడిగి తెలుసుకొన్నారు. విద్యుత్ సౌకర్యం గురించి విద్యార్థిని విద్యార్థులను గదులలో ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదిలో లైట్లు వస్తున్నాయా లేదా అని విద్యార్థులను ఆరా తీశారు. మరుగుదొడ్లకు, స్నానాల గదులకు తలుపులు సరిగా ఉన్నాయా అని బాల బాలికలను అడిగి తెలుసుకున్నారు.  ఇంతకు ముందు కంటే ఇప్పుడు సౌకర్యాలు చాలా బాగున్నాయని విద్యార్థులు కలెక్టర్ కు వివరించారు.  మరుగుదొడ్లు, స్నానాల గదుల తలుపులకు కలర్స్ వేయించాలని అధికారులకు ఆదేశించారు. సావర్కర్ నగర్ కళాశాల బాలుర వసతి గృహాంలో కౌంపౌండు వాల్ ప్లాస్టింగ్ చేయించాలని పి.అర్ ఇంజనీర్లను కోరారు. అంతేగాక విద్యార్థులు వాటర్ ప్లాంట్ అవసరం ఉందని తెలుపగా కలెక్టర్ వెంటనే స్పందించి వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ వసతి గృహాలలో ఎంత మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ వెంట షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఇంఛార్జి డి.డి.  రాజ్ కుమార్, పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య,డి. ఈ.నాగయ్య,     అసిస్టెంట్ సోషల్ వెల్ఫెర్ ఆఫీసర్ కరుణ శ్రీ,  తదితరులు పాల్గొన్నారు.
ఎస్.సి. సంక్షేమ వసతి గృహలలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*.

Share This Post