ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థలకు ధ్రువీకరణ పత్రాలు అందజేయుట-జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

05-ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోర్టు హాలులో ఎన్నికైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు లకు ధ్రువీకరణ పత్రాలు రంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎన్నికల నోడల్ అధికారి రాజేశ్వర్ రెడ్డి, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post