ఏకలవ్య గురుకుల పాఠశాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్

గురుకుల పాఠశాలల విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలి

ఏకలవ్య గురుకుల పాఠశాల భవనాన్ని రానున్న 15 రోజుల్లో తుది దశ పనులు పూర్తిచేసి విద్యార్థులకు తరగతులు నిర్వహించేలా భవనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
మంగళవారం ఏకలవ్య గురుకుల పాఠశాల నిర్మాణం, ప్రస్తుతం జడ్చర్ల లో కొనసాగుతున్న విద్యార్థుల తరగతులపై తన ఛాంబర్లో కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మంచి చదువులు అందించి, వారి జీవితాల్లో ఆర్థిక సామాజిక మార్పులు తేవడానికి ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఏకలవ్య గురుకుల పాఠశాల భవనాన్ని వెల్దండ మండలం లోని గుండాల గ్రామంలో పది ఎకరాల స్థలంలో 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏకలవ్య గురుకుల పాఠశాల భవన చివరి దశ పనులు రానున్న 15 రోజుల్లో పూర్తి చేసి విద్యార్థులకు తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ప్రస్తుతం పూర్తయిన నిర్మాణ పనుల వివరాలను అధికారులు, కాంట్రాక్టర్ తో అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఏకలవ్య గురుకుల పాఠశాల ఆరో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు 240 మంది విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో కొనసాగుతున్నందున విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఏకలవ్య పాఠశాలల తరగతులు జరుగుతున్న విధానాన్ని ప్రిన్సిపాల్ తో అడిగి తెలుసుకున్న ఆయన విద్యార్థుల విద్య ప్రమాణాలు పెంచేందుకు అవసరమయ్యే పాఠ్య ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలలో వినియోగిస్తున్న కరికులం బోధనా పద్ధతుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పడిపోయి నందున విద్యార్థి తరగతిని బట్టి విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఢిల్లీ తరహాలో పాఠ్య ప్రణాళికలను రూపొందించి నిర్వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా విద్యార్థులకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వారికి కావలసిన మాస్కులు, శానిటైజర్ అందుబాటులో ఉంచాలన్నారు.
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఏఎన్ఎంలు విద్యార్థుల ఆరోగ్యాల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు.
ఆర్ సి వో తన పరిధిలోని పాఠశాలను తనిఖీ చేయాలని సూచించారు.
ఏకలవ్య పాఠశాల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల ప్రిన్సిపల్ లతో విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచేందుకు త్వరలోనే వారితో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నాగార్జున రావు ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్స్ సరస్వతి, గిరిజన సంక్షేమ శాఖ డీఈ వెంకటేశ్వర్ సింగ్, వైస్ ప్రిన్సిపల్ వెంకటనారాయణ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Share This Post