ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

బయ్యారం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -07:

ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ నెల చివరి నాటికి వాడకంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు.

మంగళవారం మధ్యాహ్నం బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాల నిర్మాణ పనులకు సంబందించిన ప్లాన్ మ్యాప్ ను కలెక్టర్ పరిశీలించి, ఏ బ్లాక్ పనులు ఏ స్టేజి లో ఉన్నాయని, వైరింగ్ , ప్లంబింగ్ కు సంబంధించిన పనులు పెండింగ్లో ఉండకూడదని, పూర్తి దశలో ఎప్పుడూ పూర్తి చేస్తారని, మిషన్ భగీరథ కనెక్షన్లు పూర్తిచేసి, బ్లాక్ వైస్ గా పూర్తి వివరాలు అందజేయాలని మోడల్ పాఠశాలలో చేపట్టాల్సిన నిర్మాణ పనులు జూన్ చివరి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, తరగతి గదుల నిర్మాణ పనులు, డైనింగ్ హాల్ కు సంబంధించిన పూర్తి స్థాయిల్లో పనులు చేయుటకు ఎక్కువ పనివాళ్లను పెట్టాలని, బాలుర హాస్టల్ బిల్డింగ్, డైనింగ్ హాల్, గర్ల్స్ బిల్డింగ్ బ్లాక్ లను కలెక్టర్ పరిశీలించి డైనింగ్ టేబుల్స్, సింగిల్ కార్టు, ఫర్నిచర్ మొదలగునవి ఎంత మేరకు అవసరం ఉన్నాయని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని, నీటి వసతి కరెంట్ సౌకర్యం పూర్తి దశల్లో చేయుటకు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

ఈ తనిఖీల్లో సి పి.డబ్ల్యూ.డి- ఏఈ రాజన్న, టి ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్ ఆర్ సి ఓ రాజలక్ష్మి, ప్రిన్సిపాల్ రవిబాబు, తహసిల్దార్ ఏ రమేష్, ఆర్ ఐ నారాయణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post