ఏదైనా పెద్ద విపత్తు సంభవించినప్పుడు నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి-అదనపు కలెక్టర్ రమేష్

ఏదైనా పెద్ద విపత్తు సంభవించినప్పుడు నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి-అదనపు కలెక్టర్ రమేష్

ఏదైనా పెద్ద విపత్తు సంభవించినప్పుడు అన్ని శాఖల అధికారులు అప్రమత్తమై సమన్వయంతో ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో విపత్తు నిర్వహణ లో భాగంగా తమ శాఖల ద్వారా విపత్తు ను ఎదుర్కోవడానికి ఉన్న వనరులు, తీసుకుంటున్న చర్యలపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అధిక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడడంతో పాటు మానవ దైనందిన జీవితాలు అస్తవ్యస్తం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి పొలిసు, అగ్నిమాపక, వైద్య , రవాణా, మత్స్య, నీటిపారుదల, అటవీ తదితర శాఖల అధికారులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణంగా భౌగోళిక పరిస్థితులు, మానవ తప్పిదాలు, ప్రమాదాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్థి నష్టము జరిగే అవకాశాలుంటాయని అన్నారు. మానవ తప్పిదాల కన్నా ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల మానవ దైనందిన జీవితాలే అస్తవ్యస్తమవుతాయని అన్నారు. ప్రకృతిని రక్షిస్తే అది మనలను కాపాడుతుందని, కాబట్టి పర్యావరణాన్ని కాపాడడం మనందరి భాద్యతని అన్నారు. ఇటువంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ సెల్ ను ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన వ్యవస్థాగత ఏర్పాటు చేసిందని అన్నారు. ఇందుకు సంబంధించి ఇండియా డిజాస్టర్ రిసోర్స్ నెట్ వర్క్ (ఐ.డి.ఆర్.యెన్. ) పోర్టల్ ను రూపొందించిందని అన్నారు. ఇందులో వివిధ లైన్ డిపార్టుమెంట్ల, ఏజెన్సీ లలో ఉన్న వనరుల వివరాలు సేకరించి పొందుపరుస్తున్నారని అన్నారు. మన జిల్లాలో కూడా విపత్తును ఎదుర్కోవడానికి వివిధ శాఖలలో ఉన్న వనరుల వివరాలను యెన్.ఐ.సి. అధికారి సహాకారంతో idrn.nidm.gov.in పోర్టల్ నందు తక్షణమే నమోదు చేయాలని సూచించారు. ప్రధానంగా ఆపద సమయంలో ఉపయోగించే పరికరాలు, వృత్తినైపుణ్య మానవ వనరులు, అత్యవసర సమయంలో సరఫరా మందులు, వస్తువులు తదితర వివరాలను ఫారం 1, ఫారం- 2ఏ, 2బి, 2 సి లో ఇవ్వాలని సూచించారు. విపత్తు నిర్వహణలో ప్రధానంగా అని లైన్ డిపార్ట్మెంట్ లను చేసుకొని భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయడంతో పాటు నిర్మాణాలను పరిశీలించడం, పునరావాస చర్యలు చేపట్టటం వంటి ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైదులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు మల్లేశం, ముఖ్య ప్రణాళికాధికారి చిన్న కొట్యాల్, ఈ.డి.ఏం. సందీప్, అగ్నిమాపక, అటవీ శాఖ, పంచాయత్ రాజ్, రవాణా తదితర శాఖల ప్రతినిధులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బలరాం పాల్గొన్నారు

Share This Post