ఏప్రిల్ లో నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాల నిర్వహణకు శాఖల నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.

* ప్రచురణార్థం *

జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 29 (శుక్రవారం). 2022

ఏప్రిల్ లో నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాల నిర్వహణకు శాఖల నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం కాలేశ్వరంలోని ముక్తిశ్వరాలయ సమావేశ మందిరం జిల్లా కలెక్టర్ జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలతతో కలిసి ఏప్రిల్ 2020 లో నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలు నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్తిశ్వరాలయం ఈఓ మారుతి మరియు ఆలయ ప్రధాన పూజారులు 1999 మరియు 2010 లో నిర్వహించిన ప్రాణహిత పుష్కరాల విశేషాలను తెలుపుతూ 1999లో 5 లక్షల మంది, 2010 లో 12 లక్షల మంది వరకు భక్తులు హాజరయ్యారని ఈసారి శాస్త్రం ప్రకారం2022 ఏప్రిల్ మాసం 13వ తేదీ నుండి 24వ తేదీ వరకు 12 రోజులు ప్రాణహిత పుష్కరాలు నిర్వహించాల్సి ఉందని ఈసారి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా కాలేశ్వరం ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి 4 సంవత్సరాల క్రితం 25 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల వివరాలను ఆలయ ఈఓ మారుతి వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన దాని కంటే ఈ సారి మరింత వైభవోపేతంగా దేశం దృష్టిని ఆకర్షించేలా ప్రాణహిత పుష్కరాలను నిర్వహించేందుకు ముందస్తుగా అధికారులు ఆయా శాఖ ద్వారా చేపట్టనున్న పనుల గురించి ఎస్టిమేట్ సిద్ధం చేసి సమర్పించాలని అన్నారు. పుష్కరాల నిర్వహణ అనేది ఒక పవిత్ర కార్యమని ఇలాంటి అవకాశం అరుదుగా వస్తాయని ఈ పుష్కర కార్యక్రమాలను నిర్వహించే ప్రతి ఉద్యోగి పుష్కరాల నిర్వహణ దైవకార్యంగా భావించి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అన్నారు.25 కోట్లరూపాయలతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన పనులు వేగంగా సాగడం లేదని పనుల వేగం పెంచాలని అదేవిధంగా మొదలు కాని పనులను క్యాన్సల్ చేసి మళ్లీ షార్ట్ టెండర్ పిలిసి పనులను నిర్వహించాలన్నారు. జాతర సమయంలో రోజుకు లక్షలాది మంది వస్తారు కాబట్టి మహాదేవపూర్ నుండి కాళేశ్వరం వరకు గల రహదారిని మరమ్మతు చేయాలని, పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, ప్రధాన ఘాట్ రోడ్డును మరియు విఐపి ఘాట్ రోడ్డును వెడల్పు చేసేందుకు ప్రణాళికలు చేయాలని, జాతర సమయంలో శానిటేషన్ సమస్య, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు వేయాలని, షవర్స్ ఏర్పాటు చేయాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను నిర్మించాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సమస్య రాకుండా అదనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని,సాంప్రదాయ ప్రకారం ఆలయంలో పూజలు జరిగేలా చూడాలని, ప్రత్యేక మెడికల్ క్యాంపులను నిర్వహించాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జాతరకు ఆర్టీసీ బస్సులను నడపాలని, పది, పదిహేను రోజుల్లో మరొకసారి ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఈలోగా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ రాణి భాయి, జడ్పిటిసి గుడాల అరుణ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకునే ఈ పుష్కరాలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ముక్తీశ్వర ఆలయానికి చేరుకోగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం గావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్ ను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, జడ్పీ సీఈవో శోభారాణి, డిపిఓ ఆశాలత, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్. శ్రీరామ్, ఆర్ అండ్ బి ఇఇ వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్ ఇఇ నిర్మల, పంచాయతీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణాశాఖ అధికారి వేణు, డిపిఆర్ఓ రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, విద్యుత్తు, ఆర్టీసీ, ఫిషరీస్, ఇరిగేషన్, నేషనల్ హైవే, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post