ఏప్రిల్ 26. నార్కట్ పల్లి లో ఈ నెల 28 న నిర్వహించ నున్న నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ సంతాప సభ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు హాజరు కానున్నారు.

సమాచారం తో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెలిప్యాడ్,పక్కన సంతాప సభ ఏర్పాట్లు మంగళ వారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.హెలిప్యాడ్ వద్ద బ్యారి కేఁడింగ్,వి.ఐ. పి,భద్రత,విద్యుత్ సరఫరా పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఎస్.ఈ చంద్ర మోహన్, డి.ఈ. విద్యా సాగర్, ఆర్&బి ఈ ఈ నరేందర్ రెడ్డి,ఎం.పి.డి. ఓ.,తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు

Share This Post