ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను నాగర్ కర్నూల్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్ అన్నారు

పత్రిక ప్రకటన
తేది 29-3-2023
నాగర్ కర్నూల్ జిల్లా
ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను నాగర్ కర్నూల్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన విడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో ఈసారి 10572 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 60 రెగ్యులర్, ఒకటి ప్రయివేట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేసారు. ఇందులో సి కేటగిరి పరీక్ష కేంద్రాలు 6 ఉన్నాయని వాటికి సకాలంలో ప్రశ్న పత్రాలు చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈసారి పదవ తరగతి పరీక్షకు కెవలం 6 పేపర్లు ఉంటాయని ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాల ఏర్పాటు, విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా రూట్ల వారిగా బస్సుల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష జరుగుతున్నంత సేపు నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు కు తగిన ఆదేశాలు జరిచేసినట్లు తెలియజేసారు. పరీక్షా కేంద్రాల్లో తాగు నీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మరుగుదొడ్లు, అవసరమైన మేరకు ఫర్నీచర్లు వంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే లైన్ డిపార్ట్మెంట్ లతో కోఆర్డినేషన్ కమిటి సమావేశం ఏర్పాటు చేసుకుని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు అనవసరపు ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఉదయం 9 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా చూసుకోవాలని తెలియజేసారు.
అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, డి.ఈ.ఓ గోవిందరాజులు, డి.యం ఆర్.టి.సి. ధరమ్ సింగ్, పోస్టల్, విద్యుత్, వైద్య శాఖ నుండి అధికారులు పాల్గొన్నారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వార జారీ.

Share This Post