ఏరియా ఆసుపత్రిలో నిర్మించతలపెట్టిన రెండు అంతస్తుల నిర్మాణ ప్లాన్ ను, వివరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

ఏరియా ఆసుపత్రిలో నిర్మించతలపెట్టిన అదనపు అంతస్తుల నిర్మాణ ప్లాన్ ను, వివరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్టు -14:

యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎన్.జి.ఓ. ఆర్థిక సహాయంతో ఏరియా హాస్పిటల్ లో కోవిద్ ఐసియు ఐసోలేషన్ వార్డు పైన నిర్మించ తలపెట్టిన 2 అంతస్తుల నిర్మాణ ప్లాన్ ను, వివరాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం పరిశీలించారు.

యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎన్జీవో ఆర్థిక సహాయంతో నిర్మించనున్న మొదటి, రెండవ అంతస్తుల నిర్మాణం ప్లాన్ ను పరిశీలిస్తూ నిర్మాణం పూర్తయితే ఎన్ని పడకలు అందుబాటులోకి వస్తాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. 

ప్రభుత్వపరంగా కొవిడ్ బ్లాక్ పై 2800 స్క్వేర్ ఫీట్ లో పనులు చేపట్టగా అట్టి నిర్మాణానికి కలుపుతూ కోవిడ్ ఐసోలేషన్ వార్డు పైన యునైటెడ్ ఆఫ్ హైదరాబాద్ ఎన్. జి.ఓ ద్వార 1400 స్క్వేర్ ఫీట్ చొప్పున రెండంతస్తుల నిర్మాణం చేపట్టనున్నామని, రెండు బ్లాకుల మధ్యలో ర్యాంప్ ఏర్పాటు చేయనున్నామని  యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వివరించారు. 1400 స్క్వేర్ ఫీట్ చొప్పున నిర్మించే ఈ అదనపు అంతస్తుల నిర్మాణం పూర్తయితే 18 పడకలు చొప్పున మొదటి అంతస్తులో, రెండవ అంతస్తులో 18 మొత్తం 36 పడకలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.  నిర్మాణ వివరాలతో కూడిన ప్రజంటేషన్ ను రూపొందించి సమర్పించాలని టి.ఎస్. ఎం. ఎస్. ఐ. డి. సి.-డి. ఇ. శ్రీనివాస్ కు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎన్. జి. ఓ. కార్యనిర్వాహుకులకు తెలుపుతూ, అనుమతి మేరకు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.  

ఈ కార్యక్రమంలో  ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ రాములు,  టి.ఎస్. ఎం. ఎస్. ఐ. డి. సి.-డి. ఇ. శ్రీనివాస్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎన్. జి. ఓ. కార్యనిర్వాహుకులు వసీం అఖ్తర్, మహేందర్, రాములు, సాయి లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post