ఏరియా ఆస్పత్రిని తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్ధం.
ములుగు, జనవరి 11,2022.

*ఏరియా ఆస్పత్రిని తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

మంగళవారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు విచ్చేసిన ప్రత్యేక వైద్య నిపుణులకు ఓ పి రూమ్స్ సమకూర్చాలని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జగదీష్ కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ఏరియా ఆసుపత్రి లో అన్ని సౌకర్యలు ఉండే లా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేల జిల్లా కలెక్టర్ స్వయంగా రక్త నమూనా పరీక్షలు చేయించుకున్నారు. అనతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి,అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉండాలని, ఆసుపత్రి ప్రాంగణం లో స్టోర్ రూమ్, ఆర్టిపిసిఆర్ సెంటర్ నిర్మాణంచేయుటకు పంచాయితీరాజ్ డిఇకి ఎస్టిమేట్ సమర్పించాలని సూచించారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాపి విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజల ప్రయోజనాల నిమిత్తం కరోన వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మాణం అన్ని వసతులతో త్వరిత గతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఆసుపత్రి పరిది లోని ఆక్సిజన్ ప్లాంట్ ను తనిఖి చేశారు .ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎం. ఆర్. ఐ స్కానింగ్ మిషన్ ను పరిశీలించారు. ఆసుపత్రిలో గార్బేజ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేఇంచాలని, ఆపత్రి సానిటేషన్ నాలాలు రూట్ క్లియర్ గా ఉండేలా చూడాలని, ఆసుపత్రి పరిసర ప్రాతం పరిశుబ్రంగా ఉండేలా చూడాలని సూపరిండెంట్ జగదీష్ ను ఆదేశించారు. ఆసుపత్రిలోని ఆఫీసులనిర్వహణ పై జిల్లా వైద్య అధికారి డా అప్పయ్య కు జిల్లా కలెక్టర్ తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డియంఅండ్హెచ్ఓ డాక్టర్ అప్పయ్య, సూపరిండెంట్ డాక్టర్ జగదీష్, డా సురేష్, పంచాయితీ రాజ్ ఇఇ వెంకటేశ్వర్లు ఎ.ఇ అజిత్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

Share This Post