ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన కలెక్టర్

ప్రచురణార్థం

ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన కలెక్టర్

మహబూబాబాద్ సెప్టెంబర్ 6.

పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం సాయంత్రం సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు.

జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో అందుకు అనుగుణంగా మూడు వందల పడకలను ఏరియా హాస్పిటల్ లో చేపడుతు న్నందున బెడ్స్ పెంచేందుకు చేపడుతున్న నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, ప్రణాళికబద్ధంగా ఉండాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ హాస్పటల్ లో పర్యటించి ఐసియు విభాగాన్ని అదేవిధంగా పిల్లల సంరక్షణ విభాగాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.

వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉంచాలన్నారు.

కలెక్టర్ వెంట ఏరియా కోఆర్డినేటర్ వెంకట రాములు, టి ఎస్ ఎమ్ ఐ డి సి ఈ ఈ ఉమా మహేష్, డి ఈ బి శ్రీనివాస్, డాక్టర్లు జగదీష్ బాలు నాయక్, ప్రాజెక్ట్ మేనేజర్ తంగం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post