ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, కమిషనర్ శరత్,

పత్రిక ప్రకటన

తేదీ : 30–05–2022

ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, కమిషనర్ శరత్,

పల్లె ప్రగతికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధమైందని తెలిపారు.: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం పల్లె ప్రగతి, తదితర కార్యక్రమాలపై హైదరాబాద్ నుంచి కమిషనర్ శరత్తో, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తోందని ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రంగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అధికారులు చేసే ప్రతి సూచనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని వారు చెప్పినట్లుగా జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తోందని వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. జిల్లాలో హరితహారం, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలకు సంబంధించి ఇప్పటికే ఎంపికలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని తాము ప్రణాళికబద్దంగా చేస్తూ న్నామని తెలిపారు. పల్లె ప్రగతిలో మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో నాటుతామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా  ప్రతిరోజూ చేపట్టే కార్యక్రమాలను కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతం చేయడానికి అధికారులందరూ సన్నద్దమై ఉన్నారని ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జెడ్ ఫై సీఈ ఓ .దేవా సహాయము, డీఆర్డీఏ పద్మజ రాణి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post