ఐన‌వోలు జాత‌ర ఏర్పాట్ల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్ష‌

ఐనవోలు అభివృద్ధికి మరో కోటి నిధులు

మల్లికార్జున స్వామి దేవాలయానికి శాశ్వత ప్రాతిపదికన పనులు

అదనంగా ఆర్టీసి బస్సులు

కార్పొరేషన్ నుంచి నిరంతరం క్లోరినేషన్

వీఐపీ లు, దాతల కోసం ప్రత్యేక పాసులు

రొడ్లకిరువైపులా… మొరం తో రోడ్ల మరమ్మతులు, చెత్తా చెదారం తొలగింపు

భ‌క్తుల‌కు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు

ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి

కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి

మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు

జాతర ప్రాంగణంలో కరోనా పరీక్ష కేంద్రాలు, వాక్సినేషన్ సెంటర్లు

ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, మేయర్ గుండు సుధారాణి, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి ఐన‌వోలు మ‌ల్లికార్జున స్వామి వారిని ద‌ర్శించుకున్న మంత్రి

ఐన‌వోలు జాత‌ర ఏర్పాట్ల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్ష‌

ఐన‌వోలు, డిసెంబ‌ర్ 11
వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా…ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర సంద‌ర్భంగా అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఏర్పాట్లు చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌ను ఆదేశించారు. జ‌న‌వ‌రి 13,14,15 తేదీల్లో మూడు రోజుల‌పాటు జ‌రిగే జాత‌ర‌లో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా, అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దులు, మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు, క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భ‌క్తుల‌కు అన్న‌దానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్ప‌న పై ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. కోటి రూపాయలతో ఐనవోలు లో శాశ్వత ప్రాతిపదికన పనులు ప్రణాళికా బద్దంగా చేపట్టాలని ఆదేశించారు.

ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చరిత్రాత్మకమైన ది. మహిమాన్వితమైనది. నేను కూడా ఈ దేవాలయం ను తరచూ దర్శిస్తూ ఉంటాను. ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు జరగాలి.

700 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన దేవాలయం. ఈ చరిత్రని మన, మన ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. దేవాలయాన్ని రక్షించి, సంరక్షించుకోవాలి. పారిశుద్ధ్యం, మంచినీరు, స్నాన ఘట్టాలు, విద్యుత్ వంటి సదుపాయాలను మరింత అభివృద్ధి పరచాలి

పున్నేలు క్రాస్ నుండి ఐనవోలు దేవాలయం వరకు రోడ్డు ను డబుల్ రోడ్డుగా మరింత అభివృద్ధి పరచాలి. స్వాగత తోరణాలు అద్భుతంగా ఉన్నాయి. బైపాస్ రోడ్డు పూర్తి చేస్తే, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. నాయి బ్రాహ్మణులకు పర్మినెంట్ అవకాశం ఉంటే బాగుంటుంది. ఒక అతిథి గృహం నిర్మించాలి. VIP లకు సదుపాయంగా ఉంటుంది. జాతర సమయంలో వచ్చే ఉద్యోగులకు సదుపాయాలు కావాలి. మండలం అయింది. మండలంలో ఉండే మౌలిక సదుపాయాలు కల్పించాలి. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలి. సుల భ్ కాంప్లెక్స్ ల నిర్మాణం. మినీ ఫంక్షన్ హాల్ వంటివి ప్రణాళికా బద్ధంగా ఒక ప్రణాళిక ను రూపొందించి అమలు చేయాల్సి ఉంది. అన్నారు.

పేరుకే 3 లేదా 4 రోజులే అయినా జాతర 2 నుంచి 3 నెలల పాటు జరుగుతుంది. ప్రతి నిత్యం ఇక్కడకు భక్తులు వస్తూనే ఉంటారు. అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఒక అధికారికి పూర్తి బాధ్యతలు అప్పగించండి. చిన్న చిన్న భాగాలుగా జాతర ప్రాంతాన్ని విభజించి, ఆయా భాగాలకు బాధ్యులను నియమించాలి. అనుభవజ్ఞులైన అధికారులను ఇక్కడ విధుల్లో నియమించాలి అన్నారు.

కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా పరీక్షా కేంద్రాలను పెట్టండి. టీకాలు వేయడానికి సిబ్బంది ఉండాలి. మాస్కులను ధరించాలి. ఆ విధంగా ప్రజలని చైతన్య పరచాలి. మాస్కులు ధరించని వాళ్లకు జరిమానాలు విధించండి

ఆలయ డోనర్ల ను బాగా చూసుకోవాలి. వాళ్ళు మన దేవాలయాలకు దాతలు వాళ్ళని గౌరవించుకోవాలని, సేవా, భక్తి భావాలతో ఇక్కడ అధికారులు, సిబ్బంది పని చేయాలి. జాతరకు ముందుగానే, ఆలయాన్ని, ఆలయ ప్రాంగణంని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. అన్ని శాఖలను సమన్వయం చేసే బాధ్యత కలెక్టర్ తీసుకోవాలి. ఇప్పటికే గత సమీక్షలో ఇచ్చిన హామీల మేరకు, నిధులు మంజూయ్యాయి. వాటి పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

*ఎమ్మెల్యే అరూరీ రమేశ్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి దాతలను సగౌరవంగా చూడాలి. వారికి ఎలాంటి లోట్లు రానివ్వవద్దు. భక్తులకు మంచి దర్శనం ఇప్పించడం లక్ష్యంగా అధికారులు, పూజారులు, ఆలయ అధికారులు పని చేయాలి అని అన్నారు.

*మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ దేవాలయాల కోసం చేస్తున్న కృషి తెలిసిందే. గతం కంటే మెరుగైన toilets గా అభివృద్ధి పరుస్తం. స్వీపింగ్ మిషన్లు అందిస్తాం. దేవాలయ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తం. జాతర సమయంలో gwmc శానిటేషన్ సిబ్బంది ని ఐనవోలు కు పంపిస్తాం అన్నారు.

*కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జాతర నిర్వహణలో అనుభవం ఉన్న అధికారులు ఉన్నాయి. వాళ్ళందరికీ మంచి సమన్వయం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలి. ఒక నోడల్ అధికారి అధ్వర్యంలో మొత్తం పనులు జరిగేలా చూస్తాం. జాతర ప్రధాన రోజుల్లో…
శానిటేషన్, మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, వైద్య బృందం, అంబులెన్స్, పార్కింగ్, పోలీస్, కరోనా పరీక్షలు, వాక్సినేషన్ కేంద్రాలు, పాసులు వంటి ఏర్పాట్లు చేస్తాం. భక్తులకు శీఘ్ర దర్శనం అయ్యేట్లు, సమస్యలు రాకుండా, సంతోషంగా వాళ్ళు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తాం అన్నారు.

*Gwmc కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ, గతంలో లాగే శానిటేషన్ సిబ్బంది, పరికరాలు అందజేస్తాం. మంచినీటి సదుపాయాలు కూడా అందిస్తాం. కమ్యూనిటీ హాల్, విద్యుత్ సదుపాయం, మొబైల్ toilets వంటివాటికి ఇబ్బంది లేకుండా చూస్తాం అన్నారు.

అంత‌కుముందు మంత్రి ఐన‌వోలు మ‌ల్లికార్జున స్వామి వారిని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి ఆల‌య ఇఓ, సిబ్బంది, పూజారులు మంత్రికి ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో మొక్కులు తీర్చుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి ఆల‌య ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆల‌య అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు, ఆలయ చైర్మన్, స్థానిక ప్రజాప్ర‌తినిధులు, వివిధ శాఖ‌ల‌కు చెందిన అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share This Post