ఐ డి ఓ సి. కార్యాలయంలో జానపద కళాజాత ప్రదర్శన : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన   తేది:14.08.2022, వనపర్తి.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా “జానపద కళాజాత ప్రదర్శన” కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
ఆదివారం ఐ డి ఓ సి. కార్యాలయంలో “జానపద కళాజాత ప్రదర్శన” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వతంత్ర భారత దేశమని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని, కొన్ని ప్రాంతాల ప్రజలు వెనుకబాటుకు గురి అవుతున్నారని, దీన్ని అధిగమించడానికి కృషి చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సమస్యల పరిష్కారంపై చేసిన కలాజాత ప్రదర్శన సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో జానపద రూపంలో చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పదిహేను రోజులపాటు వజ్రోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు, ఇందులో భాగంగా ఫ్రీడమ్ పార్క్, ఫ్రీడం రన్, ఫ్రీడమ్ ర్యాలీ, జానపద కళాజాత ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. జిల్లాలో జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమంలో ఒక లక్ష 38 వేల 500 జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ. తేది నుండి 22వ తేది వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని, ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన, వాడ వాడలా నిర్వహిస్తున్నట్లు, ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు నిర్వహించిన జానపద కళాజాత ప్రదర్శన ఆకర్షించిందని ఆయన కొనియాడారు. గ్రామాలు అభివృద్ధి చెందాయని, మనదేశంలో యువత సుమారు 65 శాతం ఉన్నట్లు, ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని, అప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడుతూ జానపద కళాజాత ప్రదర్శనలో కళాకారులు తమ ఆట, పాటలతో అలరించిందని, ప్రభుత్వం వారిని ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నందున ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, డి పి ఆర్ ఓ. ఎం.ఎ. రషీద్, ఎమ్మార్వో రాజేందర్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

………………………………….
        స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 14వ తేది రాత్రి బాణా సoచా (Fire Crackers) పేల్చే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post