ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో “తెలంగాణ స్ఫూర్తి” అంశంపై ” కవి సమ్మేళనం” కార్యక్రమం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.       తేది:02.06.2022, వనపర్తి.

రచయితలు, కవులు, సాహితీ వేత్తలు తమ కలానికి పదును పెట్టి వారి రచనల ద్వారా అనేక విషయాలను అద్భుతంగా వివరించి, చరిత్రను సృష్టించగలరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
గురువారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని “తెలంగాణ స్ఫూర్తి” అనే అంశంపై ” కవి సమ్మేళనం” కార్యక్రమంను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు, రచయితలు, సాహితీ వేత్తలు తమ రచనల ద్వారా సమాజంలోని వివిధ అంశాలను స్పృశించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతి- సంప్రదాయాలు, తెలంగాణ ప్రాశస్త్యం, తెలంగాణ కళలు, తెలంగాణ ప్రజల జీవన విధానం, తెలంగాణ స్పూర్తి వంటి అంశాలపై ఏర్పాటు చేసిన “కవి సమ్మేళనం” లో కవులు, రచయితలు వారి వారి కవిత్వం, సాహిత్యం ద్వారా పదజాలంతో భావాలను పలికించవచ్చునని, ఆనాటి నుండి ఈనాటి వరకు పురాణాల నుండి  విప్లవ సాహిత్యం వరకు ఎందరో మహానుభావులు అద్భుత కవితలు రచించిన తెలుగు, హిందీ, ఉర్దూ కవులున్నారని, మరెందరో గొప్ప వ్యక్తులు తెలంగాణలో ఉద్భవించారని ఆయన అన్నారు. ఈ తరానికి పుస్తక పఠనం అలవాటుగా చేసి, అటువంటి మహానుభావులు రచించిన కవిత్వాలు, రచనలు చదివి, అందులోని మాధుర్యం ఆస్వాదించేలా కృషి చేయాలని మంత్రి సూచించారు.
జిల్లాలోని కవులు, రచయితల నుండి 45 కవితలు అందించినట్లు మంత్రి వివరించారు. 8 ఏళ్ల  క్రితం తెలంగాణ, నేటి తెలంగాణ, బతుకమ్మ, బోనాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం జలాలు వంటి పలు అంశాలతో రచించిన తెలంగాణ కవితలు  తెలుగు, ఉర్దూ, హిందీ భాషలలో వారు, నా బంగారు తెలంగాణ, ఇది నా తెలంగాణ, తెలంగాణ వైభోగం, తెలంగాణ ఇస్ మై మదర్ ల్యాండ్, పసిడి పచ్చ తెలంగాణ, ఆనందమానందం, జై తెలంగాణ తదితర శీర్షికతో కవితలు గానం చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సం గ్వాన్, జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్.టి. ఎస్. డబ్ల్యు. సి. చైర్మన్  విధ సాయి చందర్, డీఈవో రవీందర్, డి.పి.ఆర్.ఓ. రషీద్, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, జిల్లా అధికారులు, కవులు, రచయితలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post