ఐ.డి. ఓ.సి. సిబ్బందికి, పోలీసు సిబ్బందికి ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమం : జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్

పత్రికా ప్రకటన. తేది:27.01.2023, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, పోలీసు శాఖ సిబ్బందికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమం విజయ వంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ తెలిపారు.
శుక్రవారం ఐ.డి. ఓ.సి. కార్యాలయంలో అన్ని శాఖల సిబ్బందికి, పోలీసు సిబ్బందికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి, వెంటనే కంటి అద్దాలను అందించటం జరిగిందని ఆయన తెలిపారు. ఐ.డి. ఓ.సి. సిబ్బందికి (193) మందికి, పోలీసు సిబ్బందికి (123) మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయినట్లు ఆయన సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట అదనపు ఎస్.పి. షకిర్ హుస్సేన్, డి.యస్.పి. ఆనంద్ రెడ్డి,డి.ఎం.హెచ్. ఓ.రవి శంకర్, ఎ. ఓ. సాయినాథ్, డి.పి.ఆర్. ఓ.రషీద్, వైద్య శాఖ, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post