ఒంటరి మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రోత్సహించారు

ఒంటరి మహిళలు స్వయం ఉపాధి ద్వారా   ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రోత్సహించారు.  జోగిని మహిళలు, ఒంటరి మహిళలు  పారిశ్రామిక వేత్తలు గా ఎదిగి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా నారాయణపేట మండలం కొల్లంపల్లి, ఊట్కూరు ప్రాంతాల్లో  ఫొర్టిఫైడ్ రైస్ ( న్యూట్రిషన్ మిలితమైన) పరిశ్రమ, పుట్టగొడుగుల అభివృద్ధి పరిశ్రమలు ఏర్పాటుకు  కృషి చేస్తున్న జిల్లా కలేక్టర్ ను బుధవారం ఉదయం ఓ.యం.ఐ.ఎఫ్ స్వచ్చంద సంస్థ కో ఆర్డినేటర్ ఆజమ్మ ఆధ్వర్యంలో జోగిని మహిళలు, ఒంటరి  మహిళలు జిల్లా కలెక్టర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒంటరి మహిళలు పారిశ్రామికవేత్తలు ఎదగాలని అందుకు ప్రభుత్వము తరపున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.  కొల్లంపల్లి దగ్గర ఉన్న జోగినిల 14 ఎకరాల స్థలం, ఊట్కూరు లో ఉన్న 5 ఎకరాల స్థలాన్నీ పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని సూచించారు.  మొత్తం 29 మహిళలు ఇందులో బిగగస్వాములుగా ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు.  ఒంటరి మహిళలు ధృఢ సంకల్పంతో కృషి చేస్తే ప్రభుత్వ సహకారం ఎప్పటికి ఉంటుందని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఓ.యం.ఐ.ఎఫ్ స్వచ్చంద సంస్థ కో ఆర్డినేటర్ ఆజమ్మ, సంఘ నాయకుడు వెంకటయ్య, మహిళలు పాల్గొన్నారు.

Share This Post